వాళ్ళు నడపలేక మాకు ఇస్తున్నారు.. ఇది వ్యాపారం.. సర్వీస్ కాదు..!

చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు తాము వ్యతిరేకం కాదని.. అతడు తీసిన సినిమాపై తమకు నమ్మకం ఉంటే.. తాము థియేటరల్లో రిలీజ్ చేస్తామని.. లేదంటే తీసుకోమని నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అన్నారు. ఇటీవల అతడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్న సినిమా నిర్మాతలు మీకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటుంన్నారని విలేకరి ప్రశ్నించగా.. సురేష్ బాబు ఇలా సమాధానం ఇచ్చారు.

వారి యొక్క అసమర్థత వల్లే ఇలా జరుగుతుందని తెలిపాడు. సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనేవి ఉండవు. మంచి సినిమా.. మంచి సినిమా కానివి అనేవి మాత్రమే ఉంటాయన్నారు. ఒకప్పుడు థియోటర్లు అన్నీ ముగ్గురు.. నలుగురు నిర్మాతలో ఆధీనంలోనే ఉన్నాయనేవారు. కానీ అవి తమ కంట్రోల్ లోకి రావడానికి కారణం ఎవరు ఆలోచించరని అన్నారు.

ఒక థియేటర్ యజమాని తన థియేటర్ హక్కులను వదిలిపెట్టి వేరొకరికి ఇవ్వడానికి కారణం అతడు ఆ వ్యాపారం రన్ చేయలేకనే ఇస్తున్నాడని క్లారిటీ ఇచ్చాడు. ఉదాహరణకు నందగోపాల్ యజమాని అయిన దేవీ థియేటర్ ఎవరి చేతిలోకైనా వెళ్లిందా.. లేదు కదా.. అతనికి ఆ థియేటర్ ను ఎలా రన్ చేసుకోవాలో తెలుసు.. గనుక అది అతడి చేతిలోనే ఉందంటూ తెలిపారు. ఇలా తమ వ్యాపారాలను రన్ చేసుకోలేక ఇబ్బంది పడినవారే తమకు బాధ్యతలు అప్పగించారని.. ఇలా ఎక్కువ థియేటర్లు మా వద్ద ఉన్నాయని అన్నారు.

ఒక వారంలో ఒక మంచి సినిమా రిలీజ్ అయిందంటే.. తమకు నమ్మకం ఉంటే తీసుకుంటాం లేదంటే.. లేదు అని అన్నారు. ఎక్కడైనా ఎవరైనా చేసేది బిజినెస్ మాత్రమే అని.. మేము చేసేది కూడా బిజినెస్ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీ పరిస్థితి కూడా అలానే ఉంది. సినిమా ఆడుతుందని నమ్మకం ఉంటేనే తీసుకుంటారు.. కానీ ఉపయోగం లేకుండా తీసుకోని నష్టపోవడానికి ఇష్టపడరు అని అన్నారు. అంతేగానీ తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.