Featured

ఒక్క ఫోటోతో మారిన కూలీ జీవితం.. రాత్రికి రాత్రే సెన్సేషనల్ మోడల్ అయిపోయిన కేరళ వాసి !

కాలం వింత వింత పనులు చేస్తుంది. అది ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పడం కష్టం. కాలం కలిసి వస్తే బికారీ ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోవచ్చు.. ఆగర్భ శ్రీమంతుడు రాత్రికి రాత్రే బికారీగా మారనూ వచ్చు. సేమ్ కేరళకు చెందిన ఓ వ్యక్తి జీవితం కూడా ఇలాగే మారిపోయింది. ఒకే ఒక్క ఫోటో తన జీవితాన్నే మార్చి వేసింది. కలలో కూడా ఊహించని రీతిలో వెలిగిపోతోంది. రోజువారీ కూలీ కాస్తా.. ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ అయ్యే అవకాశం దక్కింది. పూట తిండి దొరకడం కష్టంగా ఉన్న వ్యక్తి నేడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏంటా కథ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

కేరళ కొజికోడ్ జిల్లాకు చెందిన 67 ఏళ్ల మామ్మిక్కా రోజు వారీ కూలీగా పనిచేసే వాడు. రోజుకు వంద రూపాయలు సంపాదించి జీవితాన్ని సాగించేవాడు. అతడిని అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టింది. ఒకే ఒక్క ఫొటోతో అతడి జీవితాన్ని మార్చి వేసింది. ఓవర్ నైట్ సెలబ్రెటీని చేసింది. పలు ఉత్పత్తులకు అంబాసిడర్ గా మారిపోయాడు. ఒకప్పుడు పాత లుంగీ, పాత అంగీ వేసుకుని కాలినడక వెళ్లిన తను.. ఇప్పుడు అదే రోడ్డు మీద ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. నిన్నటి దాక రోజుకు 100 రూపాయల కూలీకి పని చేసిన మామ్మిక్కా… ఇప్పడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

మామ్మిక్కా జీవితం ఒక్కసారిగా అద్భుత మలుపు తీసుకోవడానికి కారణం ఫొటోగ్రాఫర్ షరీక్ వాయలీల్. ఓసారి అనుకోకుండా మామ్మిక్కాను చూశాడు షరీక్. అతడిలో ఏదో కొత్త దనం ఉందని గమనించాడు. అతడిని ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ ఫోటో బాగా వైరల్ అయ్యింది. మామ్మిక్కా సేమ్ టు సేమ్ వినాయకన్‌లా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఎలాగైనా మామ్మిక్కాను మోడల్ చేయాలి అనుకున్న షరీక్. తన వెడ్డింగ్ సూట్ కంపెనీ మోడల్ గా ఉండాలని కోరాడు.

తను ఓకే చెప్పడంతో మామ్మిక్కాను బ్యూటీ పార్లర్‌కు తీసుకు వెళ్లి మేక్ ఓవర్ చేయించాడు. షూట్ వేసి ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆయన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇతర కంపెనీలు కూడా మామ్మిక్కాను కలిశాయి. తమ కంపెనీల ఉత్పత్తులకు కూడా అంబాసిడర్ గా ఉండాలని కోరాయి. దీంతో తన లైఫ్ మొత్తం చేంజ్ అయ్యింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన షరీక్ కు ఈసందర్భంగా ధన్యవాదాలు చెప్పాడు మామ్మిక్కా. అయితే కూలి పని చేయడం అనేది తనకు గౌరవంగానే భావిస్తానని చెప్పాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago