Movie News

SP Charan : బాలసుబ్రహ్మణ్యంను రీప్లేస్ చేస్తున్న తనయుడు ఎస్పీ. చరణ్

ఓ గాన గంధర్వుడి ఒడిలో గౌరవం, ఓ స్వర స్వర్గం నుంచి రాలిన ముత్యం. అందుకేనేమో, చిన్నప్పుడే సప్త స్వరాలను నరనరాన నింపుకున్నాడు. పాటల ప్రయాణంలో ముందుంటున్నాడు. ఆయనే స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గారాల సుపుత్రుడు ఎస్పీ చరణ్. బాలు గారికి పాటలంటే ప్రాణం. మరో మాటలో చెప్పాలంటే ఆ పాటకే బాలు గారంటే ప్రేమ. అందుకే ఆయనకు పుట్టిన పిల్లలకు ఆ పాటల పేర్లనే పెట్టారు. ఆ పేరును నేడు సార్దకతం చేస్తున్నారు ఎస్పీ చరణ్. ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా పలు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ చూడలేకపోయారు చరణ్. ఓ పక్కన ప్రొడ్యూసర్ పనులను చూసుకుంటూనే మరోపక్క నాన్నగారి నుంచి వచ్చిన వారసత్వ సంగీతాన్ని కొనసాగించారు .

గాయకుడిగా అనేక పాటలు పాడారు ఎస్పీ చరణ్. మొదట డబ్బింగ్ సినిమాలకు పాటలు పాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పాటలు పాడ సాగారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో సుమారు 2500 పాటలు పాడారు. దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమను ఏలిన గాన గంధర్వుడు బాలు గారిని కోవిడ్ మహమ్మారి కారణంగా కోల్పోవాల్సి వచ్చింది. ఆయన మరణానంతరం అంతటి  ప్రతిభావంతుడి కోసం పరిశ్రమ వెతకసాగింది. ప్రస్తుతం బాలు గారి లోటును ఆయన రక్తమైన ఎస్పీ.చరణ్ తీరుస్తున్నారు. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి ప్రోగ్రాంలో బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్ ని భర్తీ చేయగల ఏకైక వ్యక్తిగా నిలుస్తున్నారు చరణ్.

మహేష్ బాబు హీరోగా సోనాలి హీరోయినిగా చేసిన సినిమా  మురారి. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. మహేష్ కు ఈ సినిమా నుంచే మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో అన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇందులో సూపర్ హిట్ అయిన ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక పాటను పాడారు ఎస్పీ.చరణ్. ఈ పాట నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది.  

నాగార్జున హీరోగా వచ్చినా సూపర్ హిట్ మూవీ మన్మధుడు సినిమాలోనూ ఓ పాట పాడారు చరణ్. నేను నేనుగా లేను అంటూ స్లోగా వెళ్లే రొమాంటిక్ మెలోడీ పాటను ఎంతో చక్కగా పాడారు. ఈ సాంగ్ కూడా చాల హిట్ అయ్యింది. గంగోత్రి సినిమాలో ఒక తోటలో ఒక కొమ్మపై ఒక పువ్వు నవ్వింది పాటను చరణే పాడారు.

ఇక ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఉదయ్ కిరణ్  మూవీ మనసంతా నువ్వే సినిమాలో టైటిల్ ట్రాక్ పడింది ఈ సంగీత పుత్రుడే. ఈ సాంగ్ యూత్ ను ఎంతగానో అట్ట్రాక్ట్ చేసింది. ప్రభాస్ హీరోగా వచ్చిన  వర్షం సినిమాలోనూ మెల్లగా కరగని వంటి రొమాంటిక్ హిట్ సాంగ్ ను చరణ్ బాబే పాడారు. గుడుంబాశంకర్ లో ఏమంటారో, సింహాద్రిలో చీమ పాట ఇలా ఎన్నో క్లాసికల్ రొమాంటిక్, మెలోడీ పాటలను పాడి ప్రేక్షకుల మదిలో అభిమానాన్ని సంపాదించారు చరణ్ ప్రస్తుతం చరణ్ ఫాంలోకి రావడంతో బాలు గారితో  పాడించలేక పోయిన పాటలను చరణ్ తో పాడించాలన్న ప్లాన్ లో ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఏదేమైనా బాలు గారి స్థానాన్ని ఆయన కుమారుడు భర్తీ చేస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago