ఓ గాన గంధర్వుడి ఒడిలో గౌరవం, ఓ స్వర స్వర్గం నుంచి రాలిన ముత్యం. అందుకేనేమో, చిన్నప్పుడే సప్త స్వరాలను నరనరాన నింపుకున్నాడు. పాటల ప్రయాణంలో ముందుంటున్నాడు. ఆయనే స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గారాల సుపుత్రుడు ఎస్పీ చరణ్. బాలు గారికి పాటలంటే ప్రాణం. మరో మాటలో చెప్పాలంటే ఆ పాటకే బాలు గారంటే ప్రేమ. అందుకే ఆయనకు పుట్టిన పిల్లలకు ఆ పాటల పేర్లనే పెట్టారు. ఆ పేరును నేడు సార్దకతం చేస్తున్నారు ఎస్పీ చరణ్. ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా పలు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ చూడలేకపోయారు చరణ్. ఓ పక్కన ప్రొడ్యూసర్ పనులను చూసుకుంటూనే మరోపక్క నాన్నగారి నుంచి వచ్చిన వారసత్వ సంగీతాన్ని కొనసాగించారు .

గాయకుడిగా అనేక పాటలు పాడారు ఎస్పీ చరణ్. మొదట డబ్బింగ్ సినిమాలకు పాటలు పాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పాటలు పాడ సాగారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో సుమారు 2500 పాటలు పాడారు. దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమను ఏలిన గాన గంధర్వుడు బాలు గారిని కోవిడ్ మహమ్మారి కారణంగా కోల్పోవాల్సి వచ్చింది. ఆయన మరణానంతరం అంతటి ప్రతిభావంతుడి కోసం పరిశ్రమ వెతకసాగింది. ప్రస్తుతం బాలు గారి లోటును ఆయన రక్తమైన ఎస్పీ.చరణ్ తీరుస్తున్నారు. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి ప్రోగ్రాంలో బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్ ని భర్తీ చేయగల ఏకైక వ్యక్తిగా నిలుస్తున్నారు చరణ్.

మహేష్ బాబు హీరోగా సోనాలి హీరోయినిగా చేసిన సినిమా మురారి. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. మహేష్ కు ఈ సినిమా నుంచే మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో అన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇందులో సూపర్ హిట్ అయిన ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక పాటను పాడారు ఎస్పీ.చరణ్. ఈ పాట నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది.

నాగార్జున హీరోగా వచ్చినా సూపర్ హిట్ మూవీ మన్మధుడు సినిమాలోనూ ఓ పాట పాడారు చరణ్. నేను నేనుగా లేను అంటూ స్లోగా వెళ్లే రొమాంటిక్ మెలోడీ పాటను ఎంతో చక్కగా పాడారు. ఈ సాంగ్ కూడా చాల హిట్ అయ్యింది. గంగోత్రి సినిమాలో ఒక తోటలో ఒక కొమ్మపై ఒక పువ్వు నవ్వింది పాటను చరణే పాడారు.

ఇక ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఉదయ్ కిరణ్ మూవీ మనసంతా నువ్వే సినిమాలో టైటిల్ ట్రాక్ పడింది ఈ సంగీత పుత్రుడే. ఈ సాంగ్ యూత్ ను ఎంతగానో అట్ట్రాక్ట్ చేసింది. ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలోనూ మెల్లగా కరగని వంటి రొమాంటిక్ హిట్ సాంగ్ ను చరణ్ బాబే పాడారు. గుడుంబాశంకర్ లో ఏమంటారో, సింహాద్రిలో చీమ పాట ఇలా ఎన్నో క్లాసికల్ రొమాంటిక్, మెలోడీ పాటలను పాడి ప్రేక్షకుల మదిలో అభిమానాన్ని సంపాదించారు చరణ్ ప్రస్తుతం చరణ్ ఫాంలోకి రావడంతో బాలు గారితో పాడించలేక పోయిన పాటలను చరణ్ తో పాడించాలన్న ప్లాన్ లో ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఏదేమైనా బాలు గారి స్థానాన్ని ఆయన కుమారుడు భర్తీ చేస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




























