Dammaigudem Indhu death mistery : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఎన్టీఆర్ కాలనీ కి చెందిన ఇందు అనే చిన్నారి దమ్మాయిగూడెం చెరువులో శవంగా కనిపించింది. తన మరణానికి గల కారణాలు ఇంకా సస్పెన్స్ గా ఉన్నాయి. స్కూలుకి వెళ్లిన చిన్నారి మరుసటి రోజు ఉదయం చెరువులో శవమై తేలింది. తానే చెరువు వద్ద ప్రమాదవశాత్తు పడి మరణించి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నా ఇందు తల్లిదండ్రులు మాత్రం ఎవరో చంపి చెరువులో వేసారంటూ ఆరోపిస్తున్నారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే ఇందు బ్రతికేదని స్థానికులు పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు ఇందు స్కూల్ కి వెళ్లి మధ్యలో ఇంటికి ఎందుకు వెళ్ళిందనే విషయాలను సద్దాం హుస్సేన్ అనే పూర్వ విద్యార్థి వివరించారు.

మా చెల్లిని కూడా వెళదామని పిలిచింది…
సద్దాం హుస్సేన్ అదే ప్రభుత్వ పాఠశాల లో పదోతరగతి వరకు చదివాడు. ఇక అతని చెల్లెలు, ఇందుతో పాటు చదువుతోంది. ఇందు మిస్ అయిన రోజున 9:20 గంటలకే స్కూల్ కి వచ్చింది. అయితే బుక్ మర్చిపోవడం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్లి బుక్ తెచ్చుకోవాలని మరో ఇద్దరమ్మాయిలను కుడా అడుగగా వాళ్ళు రాలేదు, నా చెల్లిని కూడా పిలిచింది అయితే రానని చెప్పడం తో ఒక్కతే ఇంటికి వెళ్ళింది ఇందు. స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే మార్గంలోనే దమ్మాయిగూడెం చెరువు ఉందని సద్దాం హుస్సేన్ తెలిపాడు. స్కూల్ 9:30 కి మొదలువుతుంది ఆ లోపే వెళ్ళింది. ఇందు ఇక క్లాస్ స్టార్ట్ అయ్యాక అటెండెన్స్ వేసే సమయంలో ఇందు ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో ఇంటికి ఫోన్ చేసి టీచర్ అడిగాడు అయితే ఇందు ఇంటికి రాలేదని ఇందు తండ్రి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.

10:30 ప్రాంతంలో పోలీసులకు చెప్పినా స్పందించలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో వచ్చి డాగ్స్ తీసుకొచ్చి గాలించారు. దమ్మాయిగూడెం పరిసరాల్లో వెతుకగా మరుసటి రోజు ఉదయం 11 గంటల సమయంలో చెరువులో శవం లభించింది. పోలీసులు శవాన్ని తల్లిదండ్రులకు కూడా చూపించకుండా గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. గొడవ చేసినా చూపించలేదు, దమ్మాయి గూడెం పరిసరాల్లో చెరువు కట్ట సరిగా లేదు అదీ కాక అక్కడ గంజాయి తినే యువత ఎక్కువగా ఉంటుంది. ఆ ఏరియాలో అమ్మాయిలు వెళ్లాలంటే చాలా భయపడతారు, అక్కడ కనీసం ఒక సీసీటీవీ కెమెరా కూడా లేదు. పోలీసులు ఏమి జరిగిన పట్టించుకోరు, ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి అలానే మరణించింది అంటూ సద్దాం హుస్సేన్ తెలిపాడు.































