Damu Balaji : వైఎస్ అవినాష్ బలి కాబోతున్నాడా… జగన్ ఎత్తుకు పైఎత్తు వేసిన చంద్రబాబు…: దాము బాలాజీ

0
163

Damu Balaji : 2019 ఎన్నికలు ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తను ఉన్న ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ కు కేసును ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే ఈ మధ్య కాలంలో కేసులో కొత్త ట్విస్టులు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరణ ఇచ్చారు.

అవినాష్ బలిపశువు కాబోతున్నాడు…

వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుండి వినిపిస్తున్న పేరు అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి. వీళ్ళిద్దరూ హత్యతో ప్రమేయం కలిగి ఉండి అలాగే సాక్ష్యాలను మార్చారు అనే ఆరోపణలు వినిపిస్తుండగా తాజాగా ఫోన్ డేటా ఆధారంగా అవినాష్ రెడ్డిని సిబిఐ ఇప్పటికీ 11 గంటల పాటు విచారించింది. ఇక మళ్ళీ ఈ నెల 12న విచారణకు రమ్మని అదేశించినా మళ్ళీ 6 తేదీనే విచారణకు రమ్మని అవినాష్ రెడ్డికి నోటీసులు అందించారు. అయితే అవినాష్ రెడ్డి అందుకు నిరాకరించడంతో సిబిఐ అధికారులు డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి ఇంటికి కడప లో వెళ్లి నోటీసులు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చేతికి ఇచ్చి వచ్చారు. అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ ఈ కేసులో మొదటి నుండి అవినాష్ రెడ్డి విచారణలో అసహనంగా ఉన్నారని అయితే సిబిఐ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి అన్నది ఇక్కడ ప్రశ్న అంటూ చెప్పారు. నిజానికి అవినాష్ రెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి 3 గంటల ప్రాంతంలో వైస్ భారతి కోసం నవీన్ రెడ్డి అనే వ్యక్తికి అలాగే జగన్ కోసం ఓఎస్డి శ్రీనివాస రెడ్డికి ఫోన్ చేసాడు. ఈ కాల్ డేటా సిబిఐ వద్ద ఉంది. ఇదే విషయం మీద ఆ సమయంలో వారికి కాల్ ఎందుకు చేసావ్ అని ఆయనను అడిగినప్పుడు హత్య గురించి చెప్పనికి చెసా అనే సమాధానం ఇచ్చాడు.

హత్య జరిగిందని ఉదయం 8 గంటలకు తెలుసు అని మొదట చెప్పినపుడు ఇప్పుడు హత్య గురించి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎలా చెప్పావ్ అనే ప్రశ్న ఎదురైందని అభిప్రాయపడ్డారు. ఇక గూగుల్ టేక్ అవుట్యాప్ ద్వారా సిబిఐ అవినాష్ ఇంటివద్ద వివేకానంద రెడ్డిహత్య కేసు నిందితులు తచ్చాడుతున్నట్లు తెలిసిందని ఆధారాలు చూపించారు. ఇక ఈ కేసులో అవినాష్ ను జగన్ బలి చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నాయకులు సిబిఐలో స్నేహితులను వాడుకుని చంద్రబాబు కావాలనే ఇదంతా చేస్తున్నాడు అంటూ ఆరోపిస్తున్నారు. మొత్తానికి సిబిఐ విచారణ పేరుతో అవినాష్ ను పిలిచి అరెస్టు చేసే అవకాశం ఉందని దాము బాలాజీ వివరించారు.