Dasari Vignan : లైగర్ సినిమా విడుదల అయిన రోజు నుండి మిక్సడ్ టాక్ తో నడుస్తోంది. ఒకవైపు ప్రమోషన్స్ లో విజయ్ మాట్లాడిన మాటలకు సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పూరీ మీద, విజయ్ దేవరకొండ మీద బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన లైగర్ సినిమా వసూళ్లను రాబట్టడంలో వెనుక బడింది. సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం కూడా కష్టమైంది. వరుస సెలవులు వచ్చినా, వేరే పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చుంటే ఖచ్చితంగా వసూళ్లు పెరిగేవి కానీ నెగెటివ్ టాక్ రావడంతో సినిమా వసూళ్లను రాబట్టడంలో చతికిల పడింది. ఇక ఇక్కడ బాగా నష్టపోయింది మాత్రం డిస్ట్రిబ్యూటర్లే.

ఓటీటీ లో 200 కోట్లకు భేరం… ఛార్మి డ్రామా…
ఇక ప్రమోషన్స్ సమయంలో సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ ప్రచారం చేయడం వేరే కానీ ఛార్మి ఒకడుగు ముందుకేసి ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి 200 కోట్ల ఆఫర్ వచ్చినా ఒప్పుకోలేదు, థియేటర్లో విడుదల చేయడం కోసం ఓటీటీ ఆఫర్ తిరస్కరించాను అంటూ చెప్పింది. ఇది నిజామా లేకపోతే మార్కెటింగ్ స్టంటేనా అనే విషయాన్ని సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ చెబుతూ.. అది ఛార్మి స్ట్రాటెజీ, డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొంటారని అలా చెప్పుంటుంది అంతే కానీ ఓటీటీ లో అంత మొత్తానికి రైట్స్ తీసుకునే ఇది లేదు అంటూ చెప్పారు. సినిమా ఎలా ఉంటుందో హైప్ పెంచి ప్రమోషన్స్ చేసుకోవడం తప్పు కాదు కానీ ఇలా ఫేక్ మాటలు చెప్పి మోసం చేయడం తప్పు. ఇప్పుడు లైగర్ ప్లాప్ అవ్వడం వల్ల ఛార్మి నష్టపోలేదు తన డబ్బు తనకు వచ్చేసింది. నష్టపోయింది డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళకు ఇపుడు పెట్టిన డబ్బు వచ్చే పరిస్థితి లేదు అందుకే ఆందోళన చేస్తున్నారు.

కానీ ఇపుడు వచ్చిన డబ్బుతో ఛార్మి నెక్స్ట్ ఇంకో సినిమా చేయవచ్చు కానీ ఆ సినిమా విడుదల అపుడు తనను నమ్మి మళ్ళీ డిసస్ట్రిబ్యూటర్లు సినిమా కొనే అవకాశం తక్కువ.. మంచి ధర రాకపోవచ్చు అంటూ చెప్పారు. ఇప్పటికిప్పుడు ఛార్మి కి నష్టం రాలేదు కానీ నెక్స్ట్ సినిమాకు ఇబ్బంది పడుతుంది కానీ అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి అది కూడా చెప్పలేము అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఏమాత్రం ప్రచారం లేకపోయినా కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికి బాలీవుడ్ లో హౌస్ ఫుల్ ఆడుతోంది, ఇంకా ఇపుడు వినాయక చవితి కలిసి వస్తుంది ఆ సినిమాకు అంటూ చెప్పారు. ఇక ప్రమోషన్స్ లో సినిమాను మరీ ఆకాశానికి ఎత్తి సినిమా అంచనాలను భారీగా పూరీ, ఛార్మి, విజయ్ పెంచేశారు. అలా అవ్వడం వల్లే సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు అని దాసరి విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు.



























