Pushpa-David Warner: తగ్గేదే లే అంటున్న డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్?
Pushpa-David Warner: అల్లు అర్జున్ అంటేనే ఒక మ్యానరిజం. అతడి ప్రతీ సినిమాలో ఏదో ఒక మ్యానరిజంతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాడు. ద్యావుడా అన్నా.. చాలా బాగోదు అన్నా.. తగ్గేదేలే అన్నా అతడికే సాధ్యం. ఇలా సినీ పరిశ్రమలో అతడికంటూ ఈ వెరైటీ మ్యానరీజంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే అతడిని ఫాలో అయ్యే వారిలో చాలామంది ఉన్నారు. ఇటు సెలెబ్రిటీల దగ్గర నుంచి అటు క్రికెటర్ల వరకు అల్లు అర్జున్ స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు. దీనిలో అందరి కంటే ముందు వరుసలో ఉంటాడు డ్యాషింగ్ ఒపెనర్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్. ఇతడిది ఆస్ట్రేలియా.. మన హైదరాబాద్ ఐపీఎల్ సన్ రైజర్స్ లో కీలక ఆటగాడు.
అంతకు మందు డేవిడ్ వార్నర్ అదే అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం సినిమాలో బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా పాటకు కూడా డ్యాన్స్ వేశాడు. అప్పట్లో కూడా అతడిపై ప్రశంసలు కురిశాయి. అయితే తాజాగా అతడు పుష్ప సినిమాలో ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న డైలాగ్ ‘తగ్గేదేలే’. ఆ మ్యానరిజాన్ని అతడు అద్భుతంగా పలికాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు వివిధర రకాలుగా స్పందించారు.
‘‘పుష్ప.. పుష్ప రాజ్.. నీ యవ్వ.. తగ్గేదేలే..’’ అంటూ డేవిడ్ వార్నర్ పలికిన తీరు వారెవ్వా… అనిపించింది. ప్రస్తుతం డేవిడ్ చేసిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. దీనిపై అల్లు అర్జున్ సైతం స్పందిస్తూ.. ‘వార్నర్.. డేవిడ్ వార్నర్ నీ యవ్వ తగ్గేదే లే’ అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతక ముందు జడేజా కూడా.. ఓ వీడియోను తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…