DCP Sri Sai : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డి తో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ ను హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో ఫోటో తీసి పంపాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది. నిహారిక రెడ్డికి అలాగే హరిహర ఇద్దరికీ శిక్ష పడాలి అంటూ నవీన్ కుటుంబం కోరుకుంటోంది. ఆ దిశగా నేడు అడుగులు పడినట్లు తెలుస్తోంది. మీడియా సమావేశంలో కేసులో కీలక విషయాలను డిసిపీ శ్రీ సాయి తెలిపారు.

హత్య తరువాత హరిహర తో వెళ్లిన నిహారిక…
నవీన్ హత్య ఉదంతంలో పోలీసులకు ఏమాత్రం చిక్కకుండా వ్యవహరించిన హరిహర, నిహారిక, హాసన్ ముగ్గురూ నేడు పోలీసుల ట్రాప్ కు చిక్కారు. ఇంతవరకు కేసులో కీలకంగా ఉన్న హరిహర మొదటి నుండి హత్యలో ఎవరి ప్రమేయం లేదు నేనే అంతా చేసాను అని చెప్పగా నిహారిక, స్నేహితుడు హాసన్ పాత్ర కూడా ఉందని పోలీసులు రాబట్టారు. డిసిపీ శ్రీసాయి మాట్లాడుతూ హరిహర కేసులో నిహారిక, హాసన్ ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. నిహారిక, నవీన్ హత్య తరువాత రోజు హరిహర కృష్ణ ను కలవడం, అతనికి ఖర్చులకు 1500 డబ్బులు కుడా ఇచ్చినట్లు తెలుస్తోంది, ఆపైన హరిహర హాసన్ వద్దకు వెళ్ళాడు.

ఇతర ప్రాంతాలు తిరిగి వచ్చిన తరువాత మాల్లో నిహారికను, హాసన్ ను నవీన్ ను హత్య చేసిన చోటికి తీసుకెళ్లి సాక్ష్యాలు మాయం చేయడానికి మృత దేహాన్ని కాల్చేశారు. ఇక హరిహర తన ఫోన్ డేటా ధ్వసం చేయడం, అలాగే నిహారిక, హాసన్ కూడా వారి ఫోన్స్ లో డిలీట్ చేయడం ద్వారా సాక్ష్యాలను నాశనం చేసిన విషయంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. హరిహర A1గానూ A2గా హాసన్ అలాగే A3గా నిహారిక ను చేర్చినట్లు డిసిపీ తెలిపారు.































