Deepika Padukone : బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న దీపికా పడుకొనే పలు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కే లో నటిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న ఈసినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్, దీపికా పాల్గొన్నారు.
గుండె వేగం పెరగడంతో ఆసుపత్రికి తరలింపు…..

ఇక షూటింగులో దీపికకు సడన్ గా గుండె వేగం పెరిగి అస్వస్థతకు లోనవడంతో హుటాహుటిన కామినేని హాస్పిటల్ కు తరలించారు. అయితే కంగారు పడవల్సిన పని లేదని దీపికా సాధారణ చెక్ అప్ కోసం మాత్రమే హాస్పిటల్ కి వెళ్లినట్లు దీపిక పిఆర్పి టీం ప్రకటించారు. ప్రస్తుతం దీపిక బాగుందని వదంతులు నమ్మవద్దని చెప్పారు. ఇక దీపికా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పూర్తయ్యాక నేరుగా షూటింగ్ కి వెళ్లి అమితాబ్ బచ్చన్ తో చేయాల్సిన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమా అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా గురుపూర్ణిమ నాడు మొదలుపెట్టారు.

ప్రభాస్ ఆ సందర్బంగా ఇండియా కి గురు అయిన అమితాబ్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మొదలవడం ఆనందంగా ఉందని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో దీపికా పాత్ర కూడా ఇంతవరకు చేయనటువంటి పాత్ర అని నాగ్ అశ్విన్ తెలిపారు. ఇక దీపికా ఈ సినిమా కాకుండా రన్ బీర్, ఆలియా భట్ ల బ్రాహ్మస్త్ర సినిమాలో స్పెషల్ రోల్ చేస్తోంది. ఇక అమితాబ్ తో మరో సినిమా, షారుఖ్ ఖాన్ హీరోగా పథన్, హృతిక్ రోషన్ హీరోగా ఫైటర్ సినిమాల్లో నటిస్తోంది. ఇక భర్త రన్వీర్ సింగ్ సినిమా సర్కస్ లో గెస్ట్ రోల్ చేస్తోంది.



























