దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఎంతో పాపులర్ అయిన ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే దీప్తి సునయన షణ్ముఖ్ తో కలిసి ఉన్నటువంటి ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీరిద్దరూ కలిసి ఎన్నో వీడియో సాంగ్స్ లో నటిస్తూ బాగా పాపులర్ అవడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, బ్రేకప్ కూడా చెప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ, ఆ విషయం గురించి వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు.
ఇక ప్రస్తుతం షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే షణ్ముఖ్ యశ్వంత్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి దీప్తి సునయన తనని బాగా మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి “మలుపు” అనే ఒక షార్ట్ ఫిలింలో నటించారు. ఈ క్రమంలోనే ఈ షార్ట్ ఫిలింకి సంబంధించిన టీజర్ ను దీప్తి సునైనా ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల చేసిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టీజర్ లో జస్వంత్, దీప్తి రొమాన్స్ తో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పూర్తి వీడియో సెప్టెంబర్ 16న విడుదల కానుందని తెలియజేయడమే కాకుండా విత్ లవ్ షణ్ముఖ్ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్ళిన షణ్ముక్ ను దీప్తి సునైనా బాగా మిస్ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ప్రస్తుతం “మలుపు” టీజర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…