deepthi shannu breakup : బిగ్ బాస్ వ్యవహారం దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ ఇద్దరు కూడా విడిపోయారు. ఇటీవల ఇన్ స్టా వేదికగా ఎమోషన్ పోస్ట్ పెట్టింది. ఇద్దరం విడిపోతున్నట్టు బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరని ప్రకటించింది. దీనిపై షన్నూ కూడా స్పందించాడు దీపు తన జీవితంలో సక్సెస్ కావాలని కోరుకున్నాడు.

అయితే వీటన్నింటికీ కారణం సిరినే అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. బిగ్ బాస్ హౌజ్ లో సిరి, షన్నూల మధ్య రొమాన్స్ పెరగడం చాలా మందికి నచ్చడం లేదు. ఇద్దరి మధ్య ముద్దులు, కౌగిలించుకోవడంతో మితిమీరిపోయారు. ఒకానొక సమయంలో సిరి తల్లి కూడా ఈ వ్యవహారంపై కాసింత సీరియస్ గానే స్పందించింది.

ఇదిలా ఉంటే సిరి, షన్నూలు ఇద్దరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. దీంతోనే దీపు, షన్నూకు బ్రేకప్ చెప్పింది. మరోవైపు సిరితో రిలేషన్ షిప్ లో ఉన్న శ్రీహాన్ కూడా దూరం పాటిస్తున్నాడు. అయితే వీరిద్దరు కూడా.. త్వరలోనే బ్రెకప్ చెప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
deepthi shannu breakup : ఇష్టం లేకున్నా.. బలవంతంగా బ్రేక్ అప్..
షన్నూతో విడిపోవడం ఇష్టం లేకున్నా.. దీప్తి సునయన బ్రెకప్ చెప్పాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. దీప్తి సునయన పేరెంట్స్ ఒత్తిడి మేరకే దీపు ఎమోషనల్ పోస్ట్ పెట్టిందట. దీపు తల్లిదండ్రులకు ముందుగా షణ్ముఖ్ గురించి సదభిప్రాయమే ఉన్నా.. బిగ్ బాస్ హౌజ్ లో సిరికి దగ్గరవ్వడం చూసి నచ్చడం లేదు. దీంతో దీపు కుటుంబ సభ్యులు ఇలాంటి వ్యక్తికి మీ అమ్మాయిని ఇస్తారా..? అంటూ సూటిపోటి మాటలు అనడంతో దీప్తిపై ఒత్తడి పెంచి విడిపోయేలా చేశారని తెలుస్తోంది. మరి వీరి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.





























