Devireddy Tulasamma: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతూ డైలీ సీరియల్ ను తలపిస్తూ కొత్త క్యారెక్టర్స్ పుడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త వ్యక్తి పేరు ఈ కేసులో వినిపిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర విచారణ ఆగిపోయింది. అయితే ఇల్లీగల్ అఫైర్స్ వివేకానంద చావుకు కారణమని పలు మార్లు వినిపించినా వివేకానంద రెండో భార్య గురించి కూడా పలు కథనాలు రావడానికి ఫిబ్రవరి 2012 లో దేవిరెడ్డి తులసమ్మ అనే మహిళ కడప మేజిస్ట్రేట్ వద్ద చెప్పిన కథనమే. అపుడే మొదటి సారి వివేకానంద రెండో భార్య ఆమె కొడుకు గురించి అందరికీ తెలిసింది. ఇక ఈ విషయాల గురించి అనలిస్ట్ బాలాజీ మాట్లాడారు.

అసలు తులసమ్మ చెప్పిందేమిటి…
తులసమ్మ భర్త దేవిరెడ్డి ఉమాశంకర్ రెడ్డిని a5 గా వివేకానంద హత్య కేసులో సిబిఐ పేర్కొనడం గురించి అభ్యంతరం తెలుపుతూ తులసమ్మ సిబిఐ ని తప్పు పట్టారు. ఆ సమయములోనే వివేకానంద రెండో వివాహం గురించి కూతురు సునీత ఆమె భర్త నర్రేడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన అన్న శివ ప్రకాష్ రెడ్డికి వివేకానంద పెళ్లి పై ఉన్న అభ్యంతరాలను వివరించారు. షమీమ్ ను పెళ్లి చేసుకోవడం సునీత తన భర్తకు ఇష్టం లేదని వాళ్ళే ఏమైనా చేసి ఉండవచ్చనే కోణంలో విచారించకుండా సిబిఐ వీటిని వదిలేసి అసలు వివేకానంద గారితో ఎటువంటి శత్రుత్వం లేని నా భర్తను కేసులో చేర్చారని తెలిపారు.

ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి చెప్పిన మాటలను పట్టుకుని నా భర్తను కేసులో ఇరికించారని ఆమె కోర్ట్ లో తన వాదన వినిపించారు. ఆ సమయంలోనే వివేకానంద రెండో పెళ్లి, ఆయన పేరును అక్బర్ గా మార్చుకోవడం, ఆయన రెండో భార్యతో ఉన్న సంతానం గురించి బయటికి బాగా తెలిసింది అంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు.





























