Dhamaka Director: సాధారణంగా కొన్నిసార్లు మనకు తెలిసో తెలియకుండా నోరు జారితే పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటాయి. అందుకే సినిమా సెలబ్రిటీ వారు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు.ఇలా ఒక మాట మాట్లాడే ముందు పలుమార్లు ఆలోచించిన ఎంతోమంది సెలబ్రిటీలు వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు.
ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు డైరెక్టర్ త్రినాథ్ రావు.రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ధమాకా ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా డైరెక్టర్ త్రినాధరావు నీ ఉప్పర లొల్లి ఏంటి అని మాట్లాడారు.
ఈ విధంగా డైరెక్టర్ ఈ మాట అనడంతో పెద్ద ఎత్తున ఉప్పర సంఘం నేతలు డైరెక్టర్ త్రినాథ్ రావు పై మండిపడుతూ ఫిలిం ఛాంబర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు.ఉప్పర కులస్తులను కించపరిచే విధంగా డైరెక్టర్ మాట్లాడారని ఆయన బహిరంగంగా ఉప్పర కులస్తులకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేయడమే కాకుండా ఆయన దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు.
ఈ విధంగా ఉప్పర కులస్తులు పెద్ద ఎత్తున ఈ విషయంపై డిమాండ్లు వ్యక్తం చేయడంతో చేసేదేమీ లేక డైరెక్టర్ త్రినాథ్ రావు బహిరంగంగా ఉప్పర కులస్తులకు క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని,ఇకపై ఈ పదం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ నాయకులు కూడా బహిష్కరించాలని కోరుతూ ఈయన క్షమాపణలు తెలియజేశారు. ఈ విధంగా డైరెక్టర్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడింది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…