Dhanush – Aishwarya Rajanikanth : ధనుష్.. తమిళ్ సినిమాలలో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ధనుష్ కు మంచి ఇమేజ్ వుంది. అంతేకాకుండా హాలీవుడ్లో నటించే అవకాశం అందుకున్న అతి కొద్ది మంది భారతీయ నటుల్లో ధనుష్ కూడా ఒకరు. ‘ది ఎక్స్ట్రాడ్నరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ సినిమాతో హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా వెంటనే జోయ్ రొస్సో, ఆంథోనీ రోస్సో దర్శకత్వం వహించిన ‘ది గ్రే మ్యాన్’ అనే మరో ఇంగ్లీష్ సినిమాలో కూడా ప్రముఖ పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసారు. ఈ సినిమాలో క్యాప్టన్ అమెరికా ఫేమ్ క్రిస్ ఇవాన్స్ హీరోగా నటించారు. ఇండియాలో లో కూడా ఈ సినిమా ప్రమోషన్లు జరిగాయి.

ధనుష్ – సారా అలీఖాన్ కలసి ప్రమోషన్ కు హాజరు…
‘ది గ్రే మ్యాన్’ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమా డైరెక్టర్ అయిన రుస్సో బ్రదర్స్ ఇండియాకు వచ్చారు. ముంబైలో రెండు రోజుల పాటు ఉన్నారు. ఈ ప్రమోషన్లలో రుస్సో బ్రదర్స్ తో పాటు హీరో ధనుష్ పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. అయితే ఓ ప్రమోషన్ కార్యక్రమానికి ధనుష్- సారా అలీఖాన్ కలిసి రావటం ఇపుడు చర్చలకు దారితిస్తోంది.

ఈ క్రమంలోనే ఇద్దరు చేతిలో చెయ్యి వేసుకొని నవ్వుతు… క్లోజ్ గా వుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నేటిజన్లు సారా కారణంగానే ధనుష్ ఐశ్వర్య వీడిపోయారు అని ఆరోపిస్తున్నారు. సారా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 18 ఏళ్ళ వివాహ బంధాన్ని కాదని భార్య ను వద్దు అనుకోవడానికి కారణం సారా అని తీవ్రంగా మండి పడుతున్నారు. అంతే కాదు తాజాగా కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్న సారా… డేటింగ్ కు పెళ్ళైన వాడైనా ఓకే అనడం ధనుష్ కోసమే అని అభిప్రాయ పడుతున్నారు.



























