Dharmavarapu Subhramanyam Son Ravi : ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ సినిమా ద్వారా తెలుగులో కమెడియన్ గా స్థిరపడిపోయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఎన్నో సినిమాల్లో తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. ఆయన సినిమాల్లో చేస్తూనే మరోవైపు బుల్లితెర మీద షోలలో చేసేవారు. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారికి స్నేహితుడు కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ తరుపున పనిచేసారు. ఇక సాక్షి ఛానెల్ లో వచ్చే రాజకీయ పేరడి కార్యక్రమం ‘డింగ్ డాంగ్’ ను కూడా నిర్వహించిన ఆయన 2013లో లివర్ క్యాన్సర్ బాధపడుతూ మరణించారు. ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలను ఆయన కొడుకు రవి బ్రహ్మ తేజ ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నాన్న చనిపోతే ఎవరూ రాలేదు…
ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి ఆయన కొడుకు రవి మాట్లాడుతూ ఆయన సింపుల్ గా ఉండేవారని అంత పెద్ధ కమెడియన్ అయినా కూడా క్యారవాన్ వినియోగించేవారు కాదని తెలిపారు. ఇక ప్రొడ్యూసర్ లను ఇబ్బంది పెట్టకుండా రెమ్యూనరేషన్ కూడా పెద్దగా డిమాండ్ చేసేవారు కాదని, వాళ్ళు ఇచ్చుకోలేమని చెబితే వాళ్ళు ఇచ్చింది తీసుకుని సినిమాలను చేశారని, ఆయన అతి మంచితనంను చాలా మంది వాడుకున్నారని తెలిపారు రవి.

ఇక ఆయనతో పాటు ‘జై చిరంజీవ’ సినిమా షూటింగ్ కి వెళ్ళినపుడు చిరంజీవి గారితో మాట్లాడానని అదే మొదటి సారి చివరి సారి అంటూ తెలిపారు. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మరణిస్తే ఇండస్ట్రీ నుండి చూడటానికి ఎవరూ రాలేదని ఆయన కొడుకు రవి తెలిపారు. కేవలం మూవీ మొఘల్ రామా నాయుడు గారు హీరో గోపీచంద్ గారు మాత్రమే వచ్చారని తెలిపారు. రామా నాయుడు గారు అనారోగ్యంతో సహకరించక పోయినా తన తండ్రిని చూడటం కోసం వచ్చారని తెలిపారు.



























