దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ఆరోగ్య సంస్థలు ప్రజలను జాగ్రత్తగా ఉండాలంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు టైప్1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడే వారు మరింత జాగ్రత్తగా కరోనా నియమాలు పాటిస్తూ డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడేవారికి కరోనా వైరస్ సోకినప్పుడు
డయాబెటిక్ కీటోఅసిడోసిస్‌కు గురవుతారు. దీని ఫలితంగా రక్తంలో కీటోన్స్ అనే యాసిడ్లు విపరీతంగా విడుదలై ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తవచ్చు.సరైన సమయంలో గుర్తించగలిగితే ప్రమాదం నుంచి బయట పడడానికి అవకాశం ఉంది. అలాగే కరోనా సోకిన డయాబెటిస్ రోగుల్లో కొవిడ్ 19తో కూడిన న్యుమోనియా బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కావున జాగ్రత్తగా వ్యవహరించాలి.
డయాబెటిస్ రోగులు కరోనా బారిన పడితే కరోనా చికిత్సలో అత్యధికంగా వాడే స్టిరాయిడ్లు, కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా వీరి మ్యూకోర్‌మైకోసిస్ బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకుంటూనే స్వల్ప శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక వంటివి దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…