మధుమేహంతో బాధపడుతున్నారా.. ఈ పరిస్థితులలో జరజాగ్రత్త!

0
312

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ఆరోగ్య సంస్థలు ప్రజలను జాగ్రత్తగా ఉండాలంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు టైప్1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడే వారు మరింత జాగ్రత్తగా కరోనా నియమాలు పాటిస్తూ డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడేవారికి కరోనా వైరస్ సోకినప్పుడు
డయాబెటిక్‌ కీటోఅసిడోసిస్‌కు గురవుతారు. దీని ఫలితంగా రక్తంలో కీటోన్స్‌ అనే యాసిడ్లు విపరీతంగా విడుదలై ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తవచ్చు.సరైన సమయంలో గుర్తించగలిగితే ప్రమాదం నుంచి బయట పడడానికి అవకాశం ఉంది. అలాగే కరోనా సోకిన డయాబెటిస్ రోగుల్లో కొవిడ్‌ 19తో కూడిన న్యుమోనియా బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కావున జాగ్రత్తగా వ్యవహరించాలి.

డయాబెటిస్ రోగులు కరోనా బారిన పడితే కరోనా చికిత్సలో అత్యధికంగా వాడే స్టిరాయిడ్లు, కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా వీరి మ్యూకోర్‌మైకోసిస్‌ బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకుంటూనే స్వల్ప శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక వంటివి దినచర్యలో భాగంగా చేసుకోవాలి.