Prashanth Neel: కేజిఎఫ్ డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాడని మీకు తెలుసా… ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రశాంత్ నీల్!
Prashanth Neel: దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చించుకుంటున్న సినిమాలలో కేజిఎఫ్ 2 ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా రికార్డులు సృష్టించడంతో ఒక్కసారిగా హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగి పోతున్నాయి.
ఈ విధంగా ఈ సినిమా విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా కేజిఎఫ్2 లో హీరో తల్లి ముంబైలో చనిపోతే పూడ్చిన మట్టితో సహా తీసుకువచ్చి కేజీఎఫ్ లో సమాధి కట్టిస్తాడు.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి యాంకర్ ప్రశ్నిస్తూ ఇలాంటి ఐడియా మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెబుతూ ఇది నా నిజ జీవితంలో చేయాలనుకున్నా, అయితే ప్రాక్టికల్ గా కుదరదు కనుక సినిమాలో ఈ సన్నివేశాన్ని పెట్టానని డైరెక్టర్ వెల్లడించారు. తనకు తన నానమ్మ అంటే ఎంతో ఇష్టమని ప్రశాంత్ ఈ సందర్భంగా వెల్లడించారు.
మా నాన్నమ్మ నిత్యం నా వెంటే ఉంటూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. నేను తినకపోతే దగ్గరుండి తినిపించేది. ఈ విధంగా తనతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అయితే తను చనిపోయిన తర్వాత తనని పూడ్చి పెట్టడానికి మాకంటూ ఇక్కడ సొంత స్థలం లేక తనని మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కి తీసుకెళ్లి పూడ్చి పెట్టాము.ఎప్పటికైనా తన సమాధిని తీసుకువచ్చి నా ఇంటి వాకిట్లో పెట్టుకోవాలన్నది నా కల.అది కుదరదు కనుక సినిమాలో ఈ సన్నివేశాన్ని చూపించామని వెల్లడించారు.
ఈ విధంగా ప్రశాంత్ నీల్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని తెలియజేయడంతో ఎంతోమంది తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తండ్రి ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తిగా కాగా తల్లి కర్ణాటకకు చెందిన వ్యక్తి. మొత్తానికి ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తెలుగు వ్యక్తి కావడం తెలుగువారు గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు.
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…