Diet planer Mangam Vijay : సితార డైట్ ప్లాన్ ఇదే… అల్లు అర్జున్, చిరంజీవి, మహేష్ బాబు అందరి డైట్ ప్లానర్..: విజయ్ మంగమ్

0
182

Diet planer Mangam Vijay : సెలబ్రిటీలనగానే ఏమైనా చేయొచ్చు, వాళ్లకు నచ్చినట్లు ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంటాం కానీ వాళ్ళు మనలాగా తినాలనుకున్నవన్నీ తినలేరు. పబ్లిక్ లో తిరగలేరు. నచ్చిన ఫుడ్ కళ్ళముందే ఉన్నా డైట్ పేరుతో నోరు కట్టేసుకోవాల్సిందే. ఆరోగ్యకరమైన అలాగే బరువెక్కకుండా ఉండే సమతుల్య ఆహారం తీసుకుంటారు. ఇంతకుముందు వారికి నచ్చినట్లు తిని షేప్ అవుట్ గా ఉన్న హీరోలను హీరోయిన్స్ నీ ఆదరించేవాళ్ళు కానీ ఇపుడు హీరో హీరోయిన్లు ఎంత ఏజ్ వచ్చినా ఫిట్నెస్ మైంటైన్ చేయకపోతే జనాలలో ఆదరణ కోల్పోతారు. అందుకే వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ ను పెట్టుకుని మరీ బాడీ మైంటైన్ చేస్తారు సెలబ్రిటీస్. అలా సెలబ్రిటీస్ మెచ్చిన డైట్ ప్లానర్ విజయ్ మంగమ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా తినాలి వంటి విషయాలను పంచుకున్నారు.

మహేష్.. అల్లు అర్జున్.. చిరు.. ఏమి తింటారంటే…

హీరోలలో ఇప్పటికీ నాలుగు పదుల వయసులో ఉన్నా టీనేజే కుర్రాడిలా ఉండే హీరో మహేష్ బాబు. ఆయన ఫిట్నెస్ అలాగే డైట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రస్తుతం ఫుడ్ విషయంలో విజయ్ మంగమ్ డైట్ ప్లాన్ ను మహేష్ పాటిస్తారట. ఒక్క మహేష్ బాబే కాదు అల్లు అర్జున్, చిరంజీవి ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఆయన డైట్ న్యూట్రిషనల్ ఫుడ్ నే తీసుకుంటున్నారట. మహేష్ బాబుకి ఆల్రెడీ ఆహారం ఎలా తీసుకోవాలో బాగా తెలుసు అంటూ చెప్పే విజయ్, ఆయన అభిరుచులకు తగ్గట్టు రోజూ బ్రేక్ ఫాస్ట్ లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇలా బాక్స్ పంపుతాం. ఆయనకు మా ఫుడ్ నచ్చింది. అందుకే సీతార, గౌతమ్ కి కూడా ఫుడ్ పంపమని చెప్పారు.

అయితే మహేష్ గారికి పంపే ఫుడ్ పిల్లలకు నచ్చక పోవచ్చు అందుకే కిడ్స్ కి డిఫరెంట్ గా ప్రిపేర్ చేసి పంపమని నమ్రత అడిగారని అందుకే సితార కు డిఫరెంట్ ఫుడు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రోటీన్స్ మాత్రమే తీసుకుంటే శరీరంలో నీటి శాతం తగ్గుతుందని అందుకే ప్రోటీన్స్, కార్బ్స్ అన్నీ సమతులంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి అంటూ విజయ్ తెలిపారు. ఇక ప్లాస్టిక్ వాటిలో హెల్తీ ఫుడ్ తీసుకున్నా అది నాన్ హెల్తీ అయిపోతుంది అంటూ సలహా ఇచ్చారు. వెజ్, నాన్ వెజ్ రెండింటినీ బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి అలాగే కూరగాయలను కూడా మోతాదుకు మించి తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి, మన పొట్టలో 45 నిమిషాల్లో అరిగిపోయేటువంటి ఆహారం తీసుకున్నపుడే మన ఆరోగ్యానికి శరీరానికి మంచిది అంటూ చెప్పారు.