Dil Raju: సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమాల జాతర ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఈ క్రమంలోనే తెలుగు నిర్మాత మండలి సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఇలా నిర్మాత మండలి తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడంతోనే దిల్ రాజు వారసుడు సినిమాకు థియేటర్లో ఇవ్వద్దని చెప్పకనే చెప్పేశారు. ఇలా వారసుడు విషయం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్త వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సమస్యను వదిలేయకుండా ఆ సమస్యపై ఆయన మాట్లాడకుండా ఆయన స్నేహితులు నోరు విప్పడంతో ఈ వివాదంలో చివరికి దిల్ రాజు విజయం సాధించారు.
నిర్మాత మండలి కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడంతో సీనియర్ నిర్మాతలైనటువంటి అశ్వినీ దత్ అల్లు అరవింద్ వంటి వారు ఈ విషయంపై నోరు విప్పారు.పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు విడుదల అవుతుంటే ఇక్కడ భాషతో కొట్లాడుకోవడం సరికాదు కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా విడుదల చేసిన సక్సెస్ సాధిస్తాయి అంటూ వాదించారు.
ఈ విధంగా అల్లు అరవింద్ మాట్లాడటంతో చివరికి నిర్మాత మండలి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వారసుడు సినిమా విడుదలకు కూడా అనుమతి తెలిపారు. దీంతో సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో పాటు వారసుడు కూడా గట్టి పోటీకి దిగబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల విషయాన్ని కూడా దిల్ రాజు ప్రకటించారు. అయితే ఈ మూడు సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో అభిమానులలో సైతం ఎంతో ఆసక్తి నెలకొంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…