Director &Actor Samudhrakhani : హరీష్ శంకర్, క్రిష్ కి ఇవ్వని ఛాన్స్ పవన్ కళ్యాణ్ నాకివ్వడానికి కారణం…: దర్శకుడు &నటుడు సముద్రఖని

0
114

Director & Actor Samudhrakhani : సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా బ్రో తాజాగా ఆ సినిమా విడుదల కాగా సినిమాకు సంబంధించిన విశేషాలను తెలుపుతు చిత్ర యూనిట్ పలు ప్రొమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటోంది. అలా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిత్ర డైరెక్టర్ సముద్రఖని ఆ సినిమా విశేషాలను తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధాన్ని తెలిపారు.

పవన్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చిందంటే….

సినిమా తమిళంలో తానే నటించి డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులో సినిమాను రీమేక్ చేయాలనీ భావించారు. అలా తెలుగు నేటివిటీ కి దగ్గరగా సినిమా స్క్రిప్ట్ను సిద్ధం చేసుకోవాలని భావించినపుడు త్రివిక్రమ్ గారి వద్దకు కథ వెళ్ళింది. ఆయన స్క్రిప్ట్ లో మార్పులు చేయగా జీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కథ నచ్చి చేయాలనీ భావించారు. ఇక ఒక క్యారెక్టర్ కు సాయి ధరమ్ తేజ్ ను అనుకోగా మరో పాత్రకు ఒక పవర్ ఫుల్ నటుడైతే చెప్పాలనుకున్న మెసేజ్ జనాలకు రీచ్ అవుతుందని భావించి పవన్ కళ్యాణ్ గారిని అడగడం ఆయన ఒప్పుకోవడం జరిగాయాని సముద్రఖని తెలిపారు.

21 రోజులు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఉండగా ఆయనకు అనుకూలంగా షెడ్యూల్ ప్లాన్ చేసాం అందుకే త్వరగా సినిమా అయిపోయింది. హరీష్ శంకర్, క్రిష్ ప్రాజెక్ట్స్ కంటే ముందు ఈ సినిమా అయిపోడానికి కారణం అన్ని కలిసిరావడమే. టైం కలిసివస్తే అన్ని జరిగిపోతాయి అని నేను నమ్ముతాను అలాగే ఈ సినిమా కూడా జరిగింది అందుకే అన్న కూడా 21 రోజులు లైన్ గా షూటింగ్ కి వచ్చారు అంటూ సముద్రఖని తెలిపారు.