Director Boina Subbarao : సురేష్ ప్రొడక్షన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగంలో ఉంటూ ఎన్నో సినిమాలకు పనిచేసి కృష్ణ గారితో మొదటి సినిమాతోనే పెద్ధ హిట్ అందుకున్న డైరెక్టర్ బోయిన సుబ్బారావు గారు. ఆయన తీసిన సినిమాల్లో సావాసగాళ్ళు, మూగవాని ప్రేమ, ప్రతిజ్ఞ, ప్రేమించు వంటి సినిమాలను తీసారు. ఇక బోయిన సుబ్బారావు గారు కే.ఎస్ ప్రకాష్ గారు, మధుసూదన్ రావు గారు వంటి లెజెండ్రి డైరెక్టర్స్ తో పనిచేసారు. జీవన తరంగాలు, ప్రేమ నగర్ వంటి సినిమాలకు పనిచేసిన అనుభవం ఉండటం వల్ల రామా నాయుడు గారు ఒక సినిమా డైరెక్టర్ గా చేయమని అవకాశం ఇచ్చారు.

మొదటి సినిమా అయినా కృష్ణ సపోర్ట్ చేసారు…
కృష్ణ గారు అప్పటికే దేవదాసు మళ్ళీ పుట్టాడు వంటి సినిమాలతో ఫ్లాప్స్ తో ఉన్నారు. అయినా మొదటి సినిమా చేస్తున్న నన్ను ఆయన ఏ విషయంలోనూ అడగలేదు. వేలు పెట్టి ఇలా చెయ్ అలా చెయ్ అని చెప్పలేదు. కృష్ణ గారు కొత్తవాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటారు. ఆయన అంత కోఆపరేషన్ ఇచ్చారు కాబట్టే సినిమా చాలా బాగా వచ్చింది. ఆయనకు మళ్ళీ పెద్ధ హిట్ ఇవ్వగలిగాను అంటూ సుబ్బారావు గారు తెలిపారు.

సినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా చేయకముందు ఇక నేను డైరెక్టర్ గా ఎదగాలేనని భయమేసి ఊరెళ్ళిపోయాను. నాలుగు నెలలు తరువాత మళ్ళీ ఉన్న లగేజి తీసుకుపోడానికి చెన్నై వెళితే రామా నాయుడు గారు ఆఫర్ ఇవ్వడం, కృష్ణ గారితో సినిమా చేయడం జరిగింది అంటూ తెలిపారు.
































