Director Chandhra Mahesh : బ్రహ్మానందం కొడుకుతో సినిమా ఆగిపోడానికి కారణం ఏంటంటే… రెండు కోట్లు నాకు రాకుండా ఆగిపోడానికి కారణం…: దర్శకుడు చంద్ర మహేష్

0
26

Director Chandhra Mahesh : తెలుగులో ఎంతోమంది కెరీర్ వెతుక్కుంటూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు. అలా వచ్చిన వ్యక్తే చంద్ర మహేష్. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చంద్ర మహేష్, సురేష్ ప్రొడక్షన్ హౌస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ధర్మచక్రం వంటి సినిమాకు పనిచేసిన చంద్ర మహేష్ ఆ తరువాత 1999లో శ్రీకాంత్ తో తీసిన ‘ప్రేయసి రావే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత శ్రీహరి గారితో ఒక్కడే, అయోధ్య రామయ్య చెప్పాలని ఉంది వంటి సినిమాలతో హిట్ కొట్టాడు.

గౌతమ్ తో సినిమా ఆగిపోడానికి కారణం…

చంద్ర మహేష్ శ్రీకాంత్ హీరోగా తీసిన ప్రేయసి రావే సినిమాతో హిట్ కొట్టాడు. ఆ సినిమా చూసిన ముంబై కి చెందిన ఒక పారిశ్రామికవేత్త తన ఫ్రెండ్ ద్వారా చంద్ర మహేష్ ను కాంటాక్ట్ అయి సినిమా ఆఫర్ ఇచ్చారట. అలా ఆయన కొడుకు హీరోగా మొత్తం నాలుగు భాషలలో సినిమా చేయగా చంద్ర మహేష్ రెమ్యూనరేషన్ 15 లక్షలు కాగా సినిమా బడ్జెట్ నాలుగు భాషల్లో సినిమాలకు కలిపి 6 కోట్లు, కాగా అందులో సినిమా ఖర్చు తగ్గిస్తే ఆ మిగిలిన డబ్బాంతా డైరెక్టర్ గా నీకే ఇస్తానని చెప్పారట. అలా సినిమాకు రెండు కోట్లు మహేష్ కి రావాల్సి ఉండగా మొదటి కాపీ వచ్చే సమయానికి ఆయన గుండెపోటుతో మరనించడంతో సినిమా ఇక విడుదల కాలేదు. అలా నాకు రావాల్సిన డబ్బు రాలేదు అంటూ చెప్పారు చంద్ర మహేష్.

ఇక బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరో గా ఒక సినిమా అనుకుని కథ రెడీ చేయగా కథను మరీ కొంతమందికి చూపించి స్క్రిప్ట్ ఇంప్రూవ్ చేయాలని అనుకుంటే చివరికి కథ, సినిమా పట్టాలెక్కలేదట. అయితే కథలోని ఒక్కో ముక్క ఒక్కో సినిమాగా పరుగు, రెడీ ఇలా చాలా సినిమాలు వచ్చాయట. మూలకథ అందించిన అశోక్ గారు చూడు మన సినిమా ఎన్ని ముక్కలయిందో అని బాధపడ్డారు ఆంటూ చెప్పారు చంద్ర మహేష్.