Director Geetha Krishna : ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్ లో ఉండటం వంటివన్నీ కామన్. అయితే ప్రేమ, లివింగ్ టుగెదర్ వరకు ఉంటారు కానీ పెళ్లి పీటలెక్కేది కొంతమందే. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రేమ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి నటుడుగా గుర్తింపు అందుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎప్పటి నుండో వీరి మధ్య రిలేషన్ ఉందని వినిపిస్తున్నా మొదట్లో ఈ జంట కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇపుడు ఏకంగా ఇంట్లో పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోన్నారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో నిహారిక ఒంటరిగా కనిపించడం మరో సారి హాట్ టాపిక్ అయింది. ఇక ఈ ఇష్యూ గురించి డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడారు.

చైతన్య, నిహారిక విడిపోయినట్లేనా…
గీతా కృష్ణ గారు మాట్లాడుతూ కుటుంబ వేడుకలో అందరూ కనిపించగా నిహారిక భర్త మాత్రం రాలేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో వాళ్లిద్దరూ విడిపోతున్నారు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుండగా తాజాగా వరుణ్ లావణ్య ల ఎంగేజ్మెంట్ కి రాకపోవడంతో ఈ అనుమానం మరింత బలపడిందంటూ చెప్పారు. చైతన్య ఫ్యామిలీకి మొదటి నుండి నిహారిక సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పారు.

ఇక ఇప్పుడు నాగబాబు ఫ్యామిలీ కూడా లావణ్య త్రిపాఠికి అలాంటి కండిషన్స్ పెట్టినట్లు వినిపిస్తుండగా నిహారిక విషయంలో ఒకటి కోడలు విషయంలో ఒకటా అంటూ ట్రోల్ చేస్తున్నారని గీతా కృష్ణ తెలిపారు. చైతన్య బిజీగా ఉండి రాలేదో మరీ నిజంగానే నిహారిక, చైతన్య విడిపోతున్నారో త్వరలో తేలిపోతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునేవారు పెళ్లి చేసుకుంటే విడిపోకూడదు. ఒకవేళ రిలేషన్ విషయంలో అనుమానం ఉంటే లివింగ్ టుగెదర్ లో ఉంటే సరిపోతుంది కదా, అనవసరంగా పెళ్లి చేసుకుని విడిపోవడం ఎందుకు అంటూ డైరెక్టర్ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.

































