Director Gunashekhar : ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్ చూడగానే గుర్తొచ్చే పేరు గుణశేఖర్. ఆయన సినిమా డైరెక్టర్ గా ఎంత ఫేమస్ అయినా సెట్స్ వేయించడంలో కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కడు, అర్జున్, రుద్రమ దేవి వంటి సినిమాలు అందుకు నిదర్శనం. ఇక ఆయన బాలల రామాయణం అనే సినిమాను కేవలం చిన్నపిల్లలతో తీసి నంది అవార్డును అలాగే జాతీయ అవార్డును అందుకున్నారు. ఇక ఆయన తాజాగా రూపొందించిన సినిమా శాకుంతలం. ఆ సినిమా గురించి విశేషాలతో పాటు ఆయన సినిమా కెరీర్ గురించి కూడా గుణ శేఖర్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మహేష్ తో కష్టం…
గుణ శేఖర్ అనగానే గుర్తొచ్చే సినిమా ఒక్కడు. మహేష్ బాబు కెరీర్ చూసుకుంటే ఒక్కడు సినిమాకు ముందు ఆ తరువాత అని చెప్పొచ్చు. అలాంటి సూపర్ హిట్ తరువాత గుణ శేఖర్ మళ్ళీ మహేష్ తోనే కలిసి అర్జున్, సైనికుడు వంటి సినిమాలను తీశారు. అయితే ఒక్కడు సూపర్ హిట్ అయినా అర్జున్, సైనికుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీనికి కారణాలను చెబుతూ సినిమాలు ఎందుకు ప్రేక్షకులకు నచ్చవు అనడానికి కారణాలను ఇప్పటికీ చెప్పలేము కానీ ఒక సినిమాలో ఏం తప్పులు చేసాము అన్నది పరిశీలించి మళ్ళీ నెక్స్ట్ సినిమాకు చేయకుండా చూసుకోవచ్చు.

అంతే కానీ ఫ్లాప్ ఎందుకవుతుంది అనేది తెలిస్తే ఎవరూ ఫ్లాప్ సినిమాలను తీయరు కాదా అంటూ చెప్పారు. ఇక మహేష్ తోనే వరుసగా మూడు సినిమాలను చేసిన గుణ శేఖర్ గారు దాని గురించి మాట్లాడుతూ మహేష్ తో పనిచేయడం చాలా కష్టం. తనతో ఒకసారి పనిచేస్తే తన మాయలో పడిపోతాం, బయటికి రావాలని అనిపించదు. వేరే వాళ్లతో పనిచేయాలని అనిపించదు అంతలా తాను చూసుకుంటాడు. అందుకే వరుసగా మూడు సినిమాలు తనతోనే చేసాను అంటూ గుణ శేఖర్ తెలిపారు.
































