Director Jayanth C Paranji : ‘ప్రేమించుకుందాం రా’ అనే సినిమాతో వెంకటేష్ తో లవ్ యాక్షన్ డ్రామా సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు జయంత్ సి పరాంజి. కర్ణాటక లో జన్మించిన తమిళ కుటుంబానికి చెందిన జయంత్ హైదరాబాద్ లో దూరదర్శన్ లో మొదటి సారి ఒక టెలి సీరియల్ తెనాలి రామ కి డైరెక్షన్ చేసారు. ఆ సీరియల్ మంచి హిట్ అయ్యాక సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్ కి వెళ్లిన ఆయన సురేష్ బాబుకి మంచి మిత్రుడు. అలా వెంకటేష్ తో మొదట ఒక సినిమా అనుకున్నా అది మధ్యలోనే ఆగిపోయింది. ఆపైన ప్రేమించుకుందాం రా సినిమాను తీసి హిట్ అందుకున్నారు. అలా వరుసగా మూడు హిట్లందుకున్న జయంత్ గారు ఆయన మొహమాటం వల్లే పలు ఫ్లాప్స్ ను చూశానని, సినిమాల్లో గ్యాప్ తీసుకోడానికి కూడా కారణం నో చెప్పలేక పోవడమే అంటూ చెప్తారు.

మహేష్, పవన్ అభిమానులకు నచ్చలేదు…
మహేష్ బాబు హీరోగా జయంత్ తీసిన సినిమా కౌ బాయ్ బ్యాక్ డ్రాప్ ‘టక్కరి దొంగ’. తెలుగు నేటివిటీ కి దూరంగా హాలీవుడ్ సినిమాగా అనిపించే టక్కరి దొంగ మహేష్ అభిమానులను నిరాశపరిచింది. ఆ సినిమా తెలుగుదనం లేకపోవడం వారికి నచ్చలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో తీసిన ‘తీన్మార్’ సినిమా విషయంలో కూడా త్రిష, సోను సూద్ ను పెళ్లి చేసుకొని మళ్ళీ పవన్ దగ్గరకు వెళ్ళడాన్ని ఆయన అభిమానులు ఒప్పుకోలేదు. సినిమా విడుదల అయ్యాక అభిమానులు నా ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసారు. సెకండ్ హ్యాండ్ అయిన హీరోయిన్ ను మా హీరోకి ఇస్తారా అంటూ అడిగారు, నేను పవన్ ను వెళ్లి అడగండి అని చెప్పే సరికి వెళ్లిపోయారు.

పవన్ అప్పటి ఇమేజ్ కి ఆ కథ సెట్ కాలేదు. అదే సినిమా హీరో సిధార్థ తోనే లేక తరుణ్ తో తీసుంటే ఫలితం వేరేలా ఉండేది అంటూ జయంత్ తెలిపారు. ఇక బాలకృష్ణ గారి సినిమా అల్లరి పిడుగు సమయానికి బాగా ఆర్థిక ఇబ్బందులు ఉండేవని, ఫ్లాప్స్ వల్ల వచ్చిన నష్టాలను పూడ్చడానికే నా రెమ్యూనరేషన్ సరిపోయింది. ఇక అల్లరి పిడుగు సినిమాతో మరో పిడుగు పడింది అంటూ చెప్పారు. ఆపైన తీన్మార్ కూడా ఫ్లాప్ అవడంతో ఆలోచనలో పడ్డాను. కన్నడ లో ఒక సినిమా చేశాను, తెలుగులో జై దేవ్ సినిమా చేశాను, 15 సంవత్సరాలలో కేవలం మూడు సినిమాలనే చేశాను అంటూ తనపై సఖియా, అల్లరి పిడుగు, తీన్మార్ ప్రభావం అంతలా పడిందని చెప్పారు.