Featured

Director Krishna Reddy : సోహెల్ ని హీరోగా తీసుకోడానికి కారణం ఇదే… మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు…: డైరెక్టర్ కృష్ణా రెడ్డి

Director Krishna Reddy : హీరో అవ్వాలనుకని ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణా రెడ్డి గారు డైరెక్టర్ గా మారి హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ‘కొబ్బరి బొండాం’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా మరోసారి ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ సినిమా తీసి హిట్ కొట్టారు. ఈ చిత్రానికి దర్శకత్వం కృష్ణా రెడ్డి వహించారు. ఆ తరువాత మూడో సినిమా రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌లోనే ‘మాయలోడు’ గా వచ్చి హ్యాట్రిక్ కొట్టారు. ఇక కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అందుకున్న కృష్ణా రెడ్డి గారు దాదాపు 18 ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాతో మనముందుకు వచ్చారు. ఆ సినిమా విశేషాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సోహెల్ ని హీరోగా ఎందుకంటే…

కృష్ణా రెడ్డి గారి సినిమాలో కథా కథనంతో పాటే సాగే పాత్రలు ఉంటాయి. అలాగే కామెడీ కూడా తగు మోతాదులో ఉంటూ అది కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక 18 ఏళ్ల తరువాత మళ్ళీ సినిమాతో కమ్ బాక్ ఇచ్చిన కృష్ణ రెడ్డి గారు రాజేంద్ర ప్రసాద్ ను మామగాను, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ను హీరోగా చూపించారు. ఈ సినిమాలో హీరోగా సోహెల్ ను సెలెక్ట్ చేసుకోడానికి గల కారణాలను చెబుతూ కథ కేవలం సోహెల్ కి మాత్రమే వినిపించానని కథ చెబుతున్నంత సేపు అతని హావభావాలను గమనించినపుడు సోహెల్ అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ కి సరిపోతాడని అనిపించింది అంటూ కృష్ణా రెడ్డి గారు పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో మీనా, హీరోయిన్ గా మృనాలిని, అలాగే సునీల్, హేమ, సురేఖ వాణి, పృథ్వీ కుమార్, సప్తగిరి, అలీ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఇక చాలా ఏళ్ల తరువాత అచ్చిరెడ్డి గారి సమర్పణలో మళ్ళీ సినిమా చేసిన కృష్ణా రెడ్డి గారు అచ్చిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ నా ఆత్మ గురించి నేనే మాట్లాడటం, పొగటం లాంటి తప్పు మళ్ళీ చేయను అంటూ వివరించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago