Manchu Manoj: మంచు మనోజ్ భూమా మౌనికల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అయితే గత ఏడాది వీరి రిలేషన్ గురించి బయటపడటంతో తరచూ వీరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. అయితే మార్చి మూడవ తేదీ వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటి కావడంతో వీరి గురించి వచ్చే వార్తలకు పూర్తిగా చెక్ పడింది.
ఈ విధంగా తన సోదరి మంచు లక్ష్మీ నివాసంలో మౌనిక మనోజ్ వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. మంచు లక్ష్మి తన తమ్ముడి పెళ్లి బాధ్యతలను భుజాలపై వేసుకొని అన్ని కార్యక్రమాలను దగ్గరుండి వీరి పెళ్లి తంతు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా వీరి వివాహానికి పలువురు సినీ సెలబ్రిటీలు ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఇకపోతే మనోజ్ మౌనికల వివాహం జరిగిన తర్వాత మొదటిసారి తన భార్య గురించి మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఈ పోస్టులో భాగంగా మనోజ్ మౌనిక చేతులను పట్టుకుని ఉండగా మరొక చిన్నారి వీరిద్దరి చేతులను పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.
ఈ ఫోటోని షేర్ చేసిన మనోజ్ శివుడి ఆజ్ఞ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. అయితే పెళ్లి తర్వాత మౌనిక తన కుమారుడు ధైరవ్ బాధ్యత మొత్తం తనదేనని ఇది ఆ శివుడి ఆజ్ఞ ప్రకారమే జరిగిందనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా వీరి వివాహం ఎంతో ఘనంగా జరగడంతో వివాహ తంతు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈ దంపతులు కర్నూలుకు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…