Director Krishna Reddy : హీరో అవ్వాలనుకని ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణా రెడ్డి గారు డైరెక్టర్ గా మారి హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ‘కొబ్బరి బొండాం’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా మరోసారి ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ సినిమా తీసి హిట్ కొట్టారు. ఈ చిత్రానికి దర్శకత్వం కృష్ణా రెడ్డి వహించారు. ఆ తరువాత మూడో సినిమా రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌లోనే ‘మాయలోడు’ గా వచ్చి హ్యాట్రిక్ కొట్టారు. ఇక కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అందుకున్న కృష్ణా రెడ్డి గారు దాదాపు 18 ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాతో మనముందుకు వచ్చారు. ఆ సినిమా విశేషాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సోహెల్ ని హీరోగా ఎందుకంటే…
కృష్ణా రెడ్డి గారి సినిమాలో కథా కథనంతో పాటే సాగే పాత్రలు ఉంటాయి. అలాగే కామెడీ కూడా తగు మోతాదులో ఉంటూ అది కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక 18 ఏళ్ల తరువాత మళ్ళీ సినిమాతో కమ్ బాక్ ఇచ్చిన కృష్ణ రెడ్డి గారు రాజేంద్ర ప్రసాద్ ను మామగాను, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ను హీరోగా చూపించారు. ఈ సినిమాలో హీరోగా సోహెల్ ను సెలెక్ట్ చేసుకోడానికి గల కారణాలను చెబుతూ కథ కేవలం సోహెల్ కి మాత్రమే వినిపించానని కథ చెబుతున్నంత సేపు అతని హావభావాలను గమనించినపుడు సోహెల్ అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ కి సరిపోతాడని అనిపించింది అంటూ కృష్ణా రెడ్డి గారు పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో మీనా, హీరోయిన్ గా మృనాలిని, అలాగే సునీల్, హేమ, సురేఖ వాణి, పృథ్వీ కుమార్, సప్తగిరి, అలీ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఇక చాలా ఏళ్ల తరువాత అచ్చిరెడ్డి గారి సమర్పణలో మళ్ళీ సినిమా చేసిన కృష్ణా రెడ్డి గారు అచ్చిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ నా ఆత్మ గురించి నేనే మాట్లాడటం, పొగటం లాంటి తప్పు మళ్ళీ చేయను అంటూ వివరించారు.





























