Director Krishnavamsi : సున్నిత అంశాలతో భావోద్వేగాన్ని చూపిస్తూ సినిమాల్లో సహజంగా అనుబంధాలను చూపించే దర్శకుడు తెలుగులో కృష్ణ వంశీ అని చెప్పొచ్చు. ఆయన తీసిన సింధూరం, ఖడ్గం వంటి సినిమాలు మొదలు నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాల వరకు అన్ని ప్రేక్షకులను కట్టిపడేసాయి. అలాంటి కృష్ణ వంశీ చాలా కాలంగా మెగా ఫోన్ కి దూరంగా ఉంటున్నాడు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న సమయంలో రంగమార్థండ అనే సినిమాతో మరోసారి వచ్చారు. ఇక తన కెరీర్ కే మైలు రాయిలాగా నిలిచిన ఖడ్గం సినిమాకి సంబంధించిన అనేక విషయాలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

నువ్వు నువ్వు పాట ఇపుడు లవ్ అంథేమ్…
ఖడ్గం సినిమా దేశభక్తికి సంబంధించిన సినిమా అయితే ఈ సినిమాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కష్టాలను కూడా చూపించాడు అలాగే ప్రేమ కథను జోడించాడు. సీరియస్ పోలీస్ ఆఫీసర్ రాధాకృష్ణ పాత్రలో శ్రీకాంత్ కు రొమాంటిక్ సాంగ్ ను పెట్టాడు. ఆ పాట ఇప్ప్పటికి ప్రేమికులకు లవ్ అంతేమ్ అనడంలో సందేహం లేదు. శ్రీకాంత్, సోనాలి బింద్రే మధ్య సాగే ప్రేమను పాటలో చక్కగా చూపించడమే కాకుండా అర్థవంతమైన లిరిక్స్ పాటకు ప్రాణం పోసాయి. సీతారామశాస్త్రి గారి రచన లో వచ్చిన ఆ పాట జ్ఞాపకాలను ఇటీవల ఇంటర్వ్యూ లో కృష్ణ వంశీ తెలిపారు. శాస్త్రి గారు, కృష్ణ వంశీ కాంబినేషన్ లో అప్పటికే గులాబీ, అంతః పురం, నిన్నే పెళ్లాడుతా, మురారి ఇలా పలు సినిమాల్లో ప్రేమ గీతాలు హిట్ గా నిలిచినా ఈ సారి మరింత గొప్పగా పాట ఉండాలని కృష్ణ వంశీ అనుకున్నారట.

అలా పాట ఎల ఉండాలని చెప్పేటప్పుడు పాటలో మనసులో అనుకునే భావాలు కాకుండా ఉండాలని అనురాగం, మనసు, ఎదురుచూపు ఇలాంటి పదాలు వద్దు నువ్వు కావాలి అన్నట్లుగా ఇద్దరు నువ్వు నువ్వు అనుకుంటూ పాడుకునే పాట కావాలి సినిమా మొత్తం పాట వెంటాడినట్లు అనిపించాలి అని చెప్పారట కృష్ణ వంశీ. ఇక శాస్త్రి గారు మరుసటి రోజు రమ్మని చెప్పి పాట చూపించారట. ఆ పాటకు దేవిశ్రీ ట్యూన్ చేశాడట. అలా పుట్టిన నువ్వు నువ్వు సాంగ్ ఇప్పటికి ప్రేమించుకునే వాళ్లకు లవ్ అంథేమ్ గా ఉంది అంటూ కృష్ణ వంశీ తెలిపారు.