Director Krishnavamsi :సున్నిత అంశాలతో భావోద్వేగాన్ని చూపిస్తూ సినిమాల్లో సహజంగా అనుబంధాలను చూపించే దర్శకుడు తెలుగులో కృష్ణ వంశీ అని చెప్పొచ్చు. ఆయన తీసిన సింధూరం, ఖడ్గం వంటి సినిమాలు మొదలు నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాల వరకు అన్ని ప్రేక్షకులను కట్టిపడేసాయి. అలాంటి కృష్ణ వంశీ చాలా కాలంగా మెగా ఫోన్ కి దూరంగా ఉంటున్నాడు. ఆ సమయంలో రంగమార్థండ సినిమాతో మళ్ళీ వచ్చారు. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక మొదలుగు వారు నటించారు. అయితే ఈ సినిమా ఎందుకు ఆడలేదు అనే విషయం గురించి ఇంటర్వ్యూలో పంచుకుంటున్నారు కృష్ణవంశీ.

అందుకే రంగమార్థండ సినిమా థియేటర్లో ఆడలేదు…
రంగమార్థండ సినిమాక రంగస్థల నటుడి జీవితం గురించి స్టోరీ. మరాఠి లో నానపాటేకర్ నటించిన నట సామ్రాట్ సినిమా కథే ఇది. అయితే తెలుగు నేటివిటీ కి తగ్గట్టు మార్పులు చేసారు. మొదట ప్రకాష్ రాజ్ సొంతంగా డైరెక్ట్ చేయాలనుకున్న కథ కృష్ణ వంశీ దగ్గరికి వచ్చింది. ఈ సినిమాలోని భావొద్వేగం వల్ల కొన్ని సీన్స్ లో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.

కథ విన్నప్పుడే నాకలా జరిగింది అందుకే కథతో బాగా ట్రావెల్ అయ్యాను అంటూ కృష్ణవంశీ చెప్తారు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని సునీశితంగా సినిమాలో చూపించారు కృష్ణవంశీ. కానీ సినిమా థియేటర్లలో ఎక్కువగా ఆడలేదు. దీనికి కారణం జనాలు కమర్షియల్ సినిమాలను చూసినట్లుగా సందేశత్మక చిత్రాలను చూడరు. సమాజానికి ఉపయోగపడే సినిమాలను తీయడం డైరెక్టర్ ఒక్కడి బాధ్యతే కాదు నిర్మాత ధైర్యం చేయాలి అలాగే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి కానీ అది జరగడం లేదు అంటూ కృష్ణ వంశీ తెలిపారు.