Director Krishnavamsi : కృష్ణ వంశీ సినిమాలనగానే తెలుగుదనంతో నిండుగా ఉగాది పచ్చడిలా ఉంటాయి. మరోవైపు సమాజానికి ఉపయోగపడేలా సామాన్యుడు ప్రశ్నించేలా మరికొన్ని సినిమాలు ఉంటాయి. అలా సునిశిత అంశాలను సైతం చక్కగా చూపించే కృష్ణ వంశీ తన కథ చర్చలను ఎపుడు తన పరమాత్మ గా చెప్పే పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో సాగించేవారట. వారిద్దరి కాంబినేషన్ లో ఎన్నో మధుర గీతలు సినిమాలలో రాగా వారి మధ్య ఉన్న అనుబంధం గురించి కృష్ణవంశీ గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఆయన చనిపోతారని ముందే చెప్పారు….
ఎన్నో వేల పాటలను రాసిన సీతారామ శాస్త్రి గారు తాను రాసిన సిరివెన్నెల అనే సినిమా పాటల ద్వారా మంచి పేరు తెచ్చుకోవడం వల్ల ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. కృష్ణ వంశీ గారు ఆయన చేత ఎన్నో పాటలను రాయించుకోవడమే కాకుండా సినిమా కథ గురించి కూడా వారి మధ్య ఎన్నో చర్చలు జరిగేవట.

కృష్ణ వంశీ గారు సీతారామ శాస్త్రి గారి గురించి చెబుతూ ఆయన నాకు పరమాత్మ వంటివారు అంటూ చెప్తారు. సినిమా ఏదైనా ఆయనతో కథ గురించి చర్చిస్తానని ఆయన మరణించక ముందు మూడేళ్ళ నుండి నాతో ఆయన ఇక వెళ్ళిపోతా టైం అయిపోయింది అంటూ చెప్పేవారు. ఆయన లేని లోటు చాలా పెద్దది నా జీవితంలో కానీ తప్పదు అంటూ కృష్ణ వంశీ తెలిపారు.