Director Maruthi : తొలివలపు సినిమాతో తెలుగులో హీరోగా కెరీర్ ను ప్రారంభించాడు గోపీచంద్. తరువాత జయం,నిజం, వర్షం వంటి సినిమాలలో విలన్ గా కూడా మెప్పించాడు. యజ్ఞం సినిమాతో మరోసారి హీరోగా మంచి సినిమా చేశాడు. అయితే తాజాగా గోపిచంద్ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా రాబోతున్న విషయం తెలిదిందే. ఈ సినిమా జులై 1 న ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా చేస్తోంది. సినిమా విడుదల దగ్గర ఉండటంతో ప్రమోషన్లో బిజీగా వున్నారు చిత్ర బృందం. దీనిలో భాగంగా పలు టీవీ ప్రోగ్రాములలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ షో లో గోపీచంద్, డైరెక్టర్ మారుతీ సందడి చేశారు.
చిన్న చిన్న పాత్రాలు ఇచ్చినా చేయదు…

చిత్ర ప్రమోషన్ లలో భాగంగా జబర్దస్త్ షో లో డైరెక్టర్ మారుతీ, గోపీచంద్ సందడి చేసారు. ఈక్రమంలోనే దర్శకుడు మారుతీ యాంకర్ అనసూయపై స్టేజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంకర్ అనసూయ పక్కా కమర్షియల్ అని చెప్పారు . జబర్థస్త్ షో స్టేజిపై మారుతీ మాట్లాడుతూ.. ‘‘ ఓ పక్కా కమర్షియల్ యాంకర్‌ను ఇవాళ కలుద్దామని ఇక్కడకు వచ్చాం . అయితే మామూలు కమర్షియల్ కాదు ఈవిడ! చిన్న చిన్న పాత్రలు ఇచ్చినా చేయదు ..’’ అని అనసూయను ఉద్ధేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే మారుతీ ఈ మాటలు అంటున్నపుడు అనసూయ ఆయనను ఇంక మాట్లాడకుండా నోరు మూయటానికి ప్రయత్నం చేసింది. కాకపోతే మారుతీ ఈ మాటలు స్టేజ్ మీద నవ్వుతూనే అన్నారు. అయినప్పటికి మారుతీ మాటల్లో ఎంతోకొంత నిజం లేకుండా పోదు కదా అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
































