Director Pavan Sadineni : ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ఒక్కసారి తనవైపు ఇండస్ట్రీ చూసేలా చేసుకున్న డైరెక్టర్ పవన్ సాధినేని. విజయవాడ కు చెందిన పవన్ సాధినేని అమెరికా వెళ్లి తల్లిదండ్రుల కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు తన ఇష్టాన్ని వదులుకోలేక షార్ట్ ఫిలిమ్స్ తీసాడు. అలా మంచి వ్యూస్ అందుకున్న పవన్ ఆ పైన సినిమాలను డైరెక్ట్ చేసి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆపైన ‘సావిత్రి’ లాంటి ఫ్లాప్ అందుకున్నా ‘సేనాపతి’ సినిమాతో మరోసారి మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ అందుకుని తాజాగా జేడి చక్రవర్తి మెయిన్ లీడ్ గా ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో మరోసారి మంచి హిట్ ఎందుకున్నాడు. త్వరలోనే పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్న పవన్ సాధినేని తన కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

కళ్యాణ్ రామ్ తో సినిమా ఆగిపోతే ఎన్టీఆర్ ఎం చేసారంటే…
ప్రేమ్ ఇష్క్ కాదల్ సినిమా తరువాత వెంటనే ఆఫర్స్ రావడంతో సావిత్రి సినిమా చేసానని అయితే సోలో లాంటి సినిమా రోహిత్ కి పడాలని అందరూ చెప్పేసరికి నాది కాని కథను నేను తీసాను అందుకే సినిమా సావిత్రి ఫ్లాప్ అయిందని పవన్ సాధినేని అభిప్రాయపడ్డారు. ఇక ఆ సినిమా అయ్యాక ఐదేళ్ళు గున్నం గంగరాజు గారి వద్ద అసిస్టెంట్ గా రైటింగ్ లో ఉండి అయన గైడన్స్ తీసుకున్నాక సినిమా మీద నా ఒపీనియన్ మారిపోయింది అంటూ చెప్పారు. అలా ఒక కథ రెడీ చేసుకున్నాక తండ్రి కొడుకుల సినిమా తీయాలని అనుకుని హరికృష్ణ, కళ్యాణ్ రామ్ లతో సినిమా చేయాలని అనుకుని కథ చెప్పి అంతా ఒకే అనుకున్నాక హరికృష్ణ గారు రోడ్ ఆక్సిడెంట్ లో మరణించడంతో ఆ సినిమా ఆగిపోయింది.

వాళ్ళింట్లో మనిషి పోయి బాధలో ఉన్నా నా సినిమా ఆగిపోయిందని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ చాలా బాధపడ్డారు. కళ్యాణ్ రామ్ నాకు భరోసా ఇచ్చి మరో ప్రాజెక్ట్ చేద్దామని చెప్పారు. అంత బాధలోనూ ఎన్టీఆర్ నన్ను కౌగిలించుకుని భరోసా ఇచ్చారు. ఇప్పటికీ కళ్యాణ్ రామ్ గారు నేను కథ రెడీ చేస్తే సినిమా చేస్తారు. వాళ్ళు అంత బాధ పెట్టుకుని కూడా సినిమా చేజారిందని నేను బాధపడుతానని నాకు ధైర్యం చెప్పారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ అంటూ పవన్ సాధినేని తెలిపారు.


































