Director Raja Vannem Reddy : క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు, ఆడవాళ్లకు ఆదివారం సెలవు కావాలి, తెలుగమ్మాయి, ప్రశ్నిస్తే వంటి కుటుంబ కథా చిత్రాలను తీసిన రాజా వన్నెం రెడ్డి గారు డైరెక్టర్ కంటే ముందు ఆర్టిస్ట్. వీధి నాటకాలు వేసిన అనుభవం ఉన్న ఆయన ఆర్టిస్ట్ అవుదామని వచ్చి చివరికి డైరెక్టర్ అయ్యారు. ఎడిటర్ మోహన్ గారిని గురువుగా భావించే రాజా గారు దాసరి గారి వద్ధ ఆయన ఆఖరి రోజుల్లో ఉన్నారు. దాసరి నారాయణ రావు గారి మరణానికి అసలు కారణాలు ఏమిటి అన్నది రాజా వన్నెం రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు.

ఆయన చేతులారా చేసుకున్నారు…
రాజా వన్నెం రెడ్డి గారిది పాలకొల్లు కావడంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాలకొల్లు, భీమవరం వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళ వద్ధకు అవకాశాల కోసం వెళ్ళలేదు. ఇక బ్రహ్మానందం గారు అప్పుడే సినిమాల్లోకి వచ్చినా అత్తిలి లో లెక్చరర్ గా పనిచేస్తూ ఆదివారం భీమవరం లో వేసే నాటకాలను చూసేవారు. నేను ముందు నుండి పరిచయం ఉండటం వల్ల నాటకం చూసి ఏంటి వీడు ఇలా చేస్తున్నాడని పిలిచి మళ్ళీ ఇంకోసారి చిరంజీవి ముందు వేయించి వీడు డైరెక్టర్ డిపార్ట్మెంట్ కు ఎందుకు అని తిట్టాడు, ఈ సంఘటన హిట్లర్ సమయంలో జరిగింది. నాలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడని తెలుసు కానీ డైరెక్షన్ వైపు వెళ్ళాను అంటూ చెప్పారు.

ఇక దాసరి గారికి సన్నిహితంగా ఉండే రాజా వన్నెం రెడ్డి గారు ఆయన మరణం గురించి ఎన్నో అపోహలు అందరికీ ఉన్నాయి కానీ ఆయన బరువు తగ్గాలని బెలూన్ లాంటిదాన్ని ఎండో స్కోప్ సహాయంతో నోటి ద్వారా పొట్టలోకి పంపి కడుపు లావుగా అయ్యేలా చేస్తారు. దాని వల్ల ఆకలి వేయదు ఇక కావాల్సిన శక్తి కోసం ప్రోటీన్స్ టాబ్లెట్స్ వేసుకునేవారు. అలా పదకొండు కేజీలు తగ్గారు. ఇక అది తీయించుకున్నాక రెండు కేజీలు పెరిగినట్లు అనిపించి మళ్ళీ పెట్టించుకుని బరువు తగ్గాలని అనుకున్నారు. దాసరి గారు వద్దు అని ఎంత చెప్పినా వినలేదు అలా అది వికటించి మరణించారు అంటూ చెప్పారు.



























