Director Ram Gopal Varma : విచిత్ర జీవి ఆర్జీవి తన మాటలతో అందరికీ కోపం తెప్పించినా సినిమాలు తీయడంలో మాత్రం ఆర్జీవి ని ఎవరూ దాటలేరు అనంతలా తన టేకింగ్ ఉంటుంది. అయితే ఇది కూడా ఒకప్పటి మాటే. ఇప్పుడు తీస్తున్న సినిమాలు అసలు ఆర్జీవి భక్తులకు కూడా ఎక్కడం లేదు. అయితే ఒకప్పుడు రాము తీసిన సినిమా కూడా ఇండియన్ టాప్ సినిమాలే, ట్రెండ్ సెట్టర్ లాంటి సినిమాలే. అలాంటి వాటిలో హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో కొన్ని అందరినీ బాగా బయపెట్టాయి. అలాంటి వాటిలో ‘భూత్’ సినిమా ఒకటి.

భూత్ సినిమా ఇల్లు ఇప్పటికీ అలానే ఉంది…
ఊర్మిళ, అజయ్ దేవగన్ మెయిన్ లీడ్స్ గా తీసిన సినిమా భూత్. ఆ సినిమాలో మెయిన్ గా సినిమా అంతా ఒక ఇంట్లో జరుగుతుంది. ఆ సినిమా జనాలను బాగా బయపెట్టిన హార్రర్ సినిమాల్లో ఒకటి. అయితే ఆ ఇల్లు కూడా అలా భయపెట్టడంలో ప్రధానపాత్ర పోషించిందని చెప్పొచ్చు. 2003 లో వచ్చిన భూత్ సినిమా కోసం ముంబైలోని వీర దేశాయ్ రోడ్డులోని ఓ ఫ్లాట్ ను షూటింగ్ కోసం తీసుకున్నారు.

అయితే అప్పటి ఆ ఇల్లు ఇప్పటి వరకూ ఎవరూ మళ్ళీ నివసించడానికి రాలేదు. కారణం భూత్ సినిమానే. ఈ విషయం ఎవరో కాదు స్వయంగా ఆర్జివినే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అప్పట్లో బాగా భయపెట్టిన ఈ సినిమా వల్ల దెబ్బకు ఆ ఇల్లు అంటే భయపడుతున్నారట. దీంతో ఆ ఇంట్లో ఎవరూ లేక ఖాళీగా ఉండిపోయిందట.
































