Director Ram Gopal Varma : లవ్ మ్యారేజ్ చేసుకున్నాను… 800 జీతానికి మొదట్లో పనిచేసాను… మా ఆవిడకి సినిమాలంటే నచ్చదు…: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

0
578

Director Ram Gopal Varma : సినిమా ఇండస్ట్రీలో అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. సినిమా హిస్టరీ తీస్తే వర్మ సినిమాలకు సెపరేట్ పేజీ ఉండాల్సిందే. ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసిన అద్భుత టెక్నిషియన్ వర్మ. శివ, రంగీలా, గాయం, గోవిందా గోవిందా, సత్య ఇలా దేనికవి భిన్నంగా చిత్రాలను తీసి అన్నింటా తన మార్క్ ఆలోచనలను జనం ముందు ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమా విశేషాలను అందిస్తూ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు వర్మ.

నాది ప్రేమ వివాహం… 800 కి పనిచేసా…

రామ్ గోపాల్ వర్మ బిటెక్ చదివే సమయంలో స్నేహితులకు చూసిన సినిమాల కథలు చెప్పడం వాళ్ళు వర్మ చెప్పిన స్టోరీ కి ఇంప్రెస్స్ అయి సినిమా చూసి సినిమా అలా లేదు నువ్వు వేరేలా చెప్పావ్ అని నువ్వు చెప్పిన స్టోరీ బాగుంది అంటూ ఒక స్నేహితుడు నాకు డబ్బు ఉంటే వర్మని పెట్టి సినిమా తీస్తా అనడంతో అక్కడ వర్మ కు సినిమా తీయాలనే ఆలోచన మొదలయిందట. ఇక చదువుయ్యాక వర్మ గారి తాతగారు హోటల్ తాజ్ లో ఉద్యోగం ఇప్పించగా నెలకు 800 వందలకు వర్మ పనిచేసారట. శాలరీ పెరుగుతుందని నైజీరియా వెళ్లి పనిచేసిన ఆయన తిరిగి సినిమా మీద పిచ్చితో ఇండియా వచ్చేసారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వర్మ హైదరాబాద్ వచ్చి రామోజీ రావు, సురేష్ బాబు వంటి వారిని కలిసి సినిమా తీయాలనుకుంటున్నాను అని చెబితే వారు ప్రాక్టికల్ గా వర్క్ ఔట్ కాదు ముందు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోమన్నారట.

ఇక ఒక రోజున వీడియో లైబ్రరీ వద్దకు వెళ్ళవలసి రావడం అలా వీడియో లైబ్రరీ పెట్టాలనే ఆలోచనతో తండ్రి వద్దకు వెళితే అప్పటికే ఉద్యోగం వదిలి కులాంతర వివాహం చేసుకుంటే వర్మ మీద సదాభిప్రాయం లేకపోయినా అన్నపూర్ణ స్టూడియోస్ లో పనిచేస్తున్న ఆయన రిటైర్ అవుతున్న సమయంలో వర్మ కు షాప్ పెట్టుకోడానికి అనుమతి ఇచ్చారట. ఇక షాప్ పెట్టాక రోజు సినిమాలు అన్ని భాషలలోను సినిమాలను చూడటం, వాటిని భార్యతో చెప్పడం వల్ల సినిమా తప్ప వేరే ఆలోచన లేకుండా పోవడం వల్ల తన భార్యకు సినిమాలంటే విరక్తి వచ్చేదట, ఆ పేరెత్తితేనే చిరాకు వచ్చేదట.