తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట శైలి, వ్యవహార తీరు ఎంతో భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ ముక్కుసూటితనంగా మాట్లాడటం వల్ల తన మాట్లాడే మాటలు పలు కాంట్రవర్సీలకు కారణమవుతుంటాయి. ఇక తాజాగా సుమంత్ రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సుమంత్ పెళ్లి విషయం పై రామ్ గోపాల్ వర్మ స్పందించి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
ఒకసారి పెళ్లి జరిగినా నీకు బుద్ధి రాలేదా సుమంత్? రెండో పెళ్లి ఏంటయ్యా? నా మాట విని ఈ పెళ్లి మానుకో లేకపోతే నీ కర్మ.. ఆ పవిత్ర కర్మ.. తప్పు మీది కాదు ఈ దౌర్భాగ్యపు వ్యవస్థది అంటూ చేసిన కామెంట్స్ తీవ్రస్థాయిలో వైరల్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సుమంత్ ను ట్యాగ్ చేస్తూ చేయడంతో ఈ ట్వీట్ పై సుమంత్ స్పందించారు.
ఈ పెళ్లి విషయం గురించి సుమంత్ స్పందిస్తూ.. తను రెండవ పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.అలాగే తను నటించబోయే “మళ్ళీ మొదలైంది” సినిమాలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ లీక్ కావడంతో అందరూ పొరపాటున పెళ్లి చేసుకుంటున్నా అనుకున్నారని క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే మరికొందరు ఇది సినిమా ప్రమోషన్ లో భాగంగా కావాలనే లీక్ చేశారంటూ పెద్దఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక వర్మ సుమంత్ మాటలకు స్పందిస్తూ… “ఓకే సర్ … సినిమాకోసం రూమర్స్ క్లియర్ చేసినందుకు దేవుడికి మరియు డెవిల్ కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను”. ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ “మళ్ళీ మొదలైంది” సినిమాను తప్పకుండా చూడాలని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…