Ramgopal Varma:నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆదివారం ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వర్మ మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొనడానికి రాలేదని తెలిపారు. కేవలం ఒక జోక్ చెప్పడానికి ఇక్కడికి వచ్చానని ఇది చాలా సీరియస్ జోక్. ఈ జోక్ వింటే ఎవరు కూడా నవ్వరని వర్మ తెలియజేశారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అని తెలిపారు.
చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని కొందరు అంటున్నారు అయితే ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తికి అవగాహన లేదా అవగాహన లేని వ్యక్తికి ఎందుకు పూజలు చేస్తున్నారు దండలు వేస్తున్నారని ప్రశ్నించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి వారు సైతం చంద్రబాబు పక్కనే కూర్చుని వాళ్లను పోగిడారు. ఇది ఒక రకంగా రజినీ కాంత్ కూడా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడొస్తున్నట్టే.
ఇక మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక్ మాత్రమే. వాళ్లందరితో పాటు వేదికను పంచుకోకుండా, అక్కడికి వెళ్లకుండా ఉన్నారు. అందుకు కారణం వాళ్ల తాత మీద ఉన్న విపరీతమైన గౌరవంతో Jr.NTR ఒక విధానానికి కట్టుబడి ఉన్నాడంటూ ఎన్టీఆర్ గురించి రాంగోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…