Director Relangi Narasimharao : తెలుగులో హాస్య ప్రధాన సినిమాలు తీసే డైరెక్టర్లలో రేలంగి నరసింహారావు గారు ఒకరు. పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక డైరెక్టర్ గా ఒక కథ హిట్ అవుతుందా లేక పోతుందా అనే విషయం కథ చర్చల్లో అలాగే స్క్రిప్ట్ వర్క్ జరిగే సమయంలోనే తెలిసిపోతుందంటూ ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.

కథ చెప్తుంటే సురేష్ బాబు మధ్యలోనే వెళ్లిపోయారు….
ఉషా కిరణ్ బ్యానర్ లో వెంట వెంటనే హిట్స్ కొట్టిన రేలంగి నరసింహారావు గారి సురేష్ ప్రొడక్షన్స్ నుండి పిలుపు వచ్చిందట. రామానాయుడు గారు పిలిచి కథ రెడీ చేసుకో సినిమా చేదాం అని చెప్పగానే రేలంగి గారు కాశి విశ్వనాధ్ అనే మరో రైటర్ ను కలిసి కథ రెడీ చేసుకున్నారట. ఇక కథ వినిపించడానికి రైటర్ తో కలిసి రామానాయుడు గారి ఇంటికి వెళ్లగా సురేష్ బాబు కూడా కథ వినడానికి వచ్చారట. కథ రామానాయుడు గారు ఓపిగ్గా వింటున్న సురేష్ బాబు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ కదులుతునే ఉన్నారట.

ఇక కథ ఇంకా పూర్తి అవ్వకనే మధ్యలో వెళ్లిపోయారట. ఇక కథ విన్నాక రామా నాయుడుగారు నరసింహరావు కథ ఇదే కదా అంత టుకీగా చెప్పారట. అదేనండి అనగానే కథ బాగోలేదు నరసింహ రావు అని ఆయన చెప్పక ముందే రేలంగి గారికి సురేష్ బాబు మధ్యలో లేచి వెళ్లిపోవడంతోనే అర్థమైందంట కథ వారికి నచ్చలేదని. ఇక ఆ కథని పక్కన పెట్టేశారట. మళ్ళీ కొద్ది కాలానికి ఆ కథ గురించి ఆలోచిస్తే అసలు ఇలాంటి కథ నేనెల చేద్దామనుకున్నాను అనిపించింది అంటూ రేలంగి నరసింహారావు తెలిపారు.