Director Sagar : సీనియర్ దర్శకులు విద్యా సాగర్ రెడ్డి అందరికి డైరెక్టర్ సాగర్ గా బాగా సుపరిచితులు. మొదట ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసి ఆ తరువాత దర్శకత్వంలోకి వచ్చిన ఈయన కృష్ణ గారితో మొదట సినిమా తీయాలని అనుకునేవారట. దాదాపు పది సంవత్సరాలపైనే సహాయ దర్శకుడిగానే పనిచేసారు. దర్శకుడిగా మంచి హిట్లందుకున్న ఈయన నిర్మాత గా సినిమా తీసి భారీ నష్టాలను చూసారు. ఇక సినిమాలను తీయకూడదని నిర్ణయించుకుని అస్త్ర సన్యాసం చేసారు.

ఇంద్రజ మీద ఆ రోజుతో గౌరవం పోయింది…
ముక్కుసూటిగా ఉన్నది మాట్లాడే సాగర్ గారు అమ్మదొంగ సినిమా సమయంలో ఇంద్రజ గారితో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడారు. ఆ సినిమా కోసం దాదాపుగా అన్నపూర్ణ స్టూడియో మొత్తం ఆరు నెలలు తీసుకున్నారు. ఇక మైసూర్ లోనూ సెట్లు వేశారు. ఇక కృష్ణ, సౌందర్య, ఆమని, ఇంద్రజ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా కే ఆర్ విజయ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఇక సినిమా షూటింగ్ కోసం కే ఆర్ విజయ గారు ఫ్లైట్ కి రావలసి ఉండగా ట్రైన్ కి రావడానికి ఒప్పుకున్నారట, అదే సమయంలో ఇంద్రజకు ట్రైన్ కి బుక్ చేయగా ట్రైన్ లో వస్తే వాంతులు అవుతాయి అని ఫ్లైట్ కి బుక్ చేయమని అడిగారట. దీంతో ఫ్లైట్ కి బుక్ చేయమని చెప్పి డైరెక్టర్ సాగర్ గారు చిత్ర యూనిట్ ఎవరు ఆమె తో మాట్లాడొద్దని, ఏం కావాలన్నా డైరెక్టర్ ని అడగమని చెప్పి పంపారట.

ఇక మూడురోజుల తరువాత ఇంద్రజ గారు సాగర్ గారి దగ్గరికి వచ్చి ఏడ్చారట. దీంతో సాగర్ గారు మీకు ట్రైన్ లో వస్తే వాంతులు అవుతాయి అలాగే ఏడిస్తే కూడా వాంతులు అవుతాఏమో ఈరోజుతో మీద ఉన్న గౌరవం పోయిందని మొహం మీదే చెప్పేశారట. ఇక దర్శకుడు కోదండ రామిరెడ్డి గారి రెమ్యూనరేషన్ అప్పట్లో డెబ్భైవేలు కాగా నేను అంబాసిడర్ కారు కొనగలనా అని సాగర్ గారిని అడిగేవారట. సాగర్ గారు మొదట తీసిన చిత్రం రాకాసి లోయ, చందమామ కథల పుస్తకం నుండి తీసుకున్న కథ అంటు ఆనాటి విషయాలను చెప్పారు.































