Director Sai Rajesh : కలర్ ఫోటో సినిమాకి 2.5 లక్షలు ఇచ్చాను… ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు…: డైరెక్టర్ సాయి రాజేష్

0
41

Director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ కలర్ ఫోటో సినిమాకు నేషనల్ అవార్డు కొట్టి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఇక బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటీనటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయిన రాజేష్ తన కెరీర్ విశేషాలను, అవమానాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సుహాస్ కి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసాను…

కలర్ ఫోటో సినినకు జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదని, అయితే కరోనా లాక్ డౌన్ సమయం కాబట్టి పోటీ కొంచం తక్కువ ఉంది, అందులోనూ సినిమాలో కలర్ డిస్క్రిమినేషన్ అనే పాయింట్ తో సినిమా సాగుతుంది అందుకే సినిమా జ్యూరి వాళ్లకు నచ్చుతుంది అని మాత్రం అనుకున్నాను అంటూ డైరెక్టర్ సాయి రాజేష్ తెలిపారు. ఇక సినిమాకు హీరో సుహాస్ కు రెమ్యూనరేషన్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.

మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చేసానని, 2.5 లక్షలు అడిగితే ఇచ్చేసానని తనతో ఎలాంటి విబేధాలు లేవంటూ చెప్పారు. బేబీ సినిమా హిట్ అయినపుడు తానే ఫోన్ చేసి తన సినిమా హిట్ అయినంత ఆనంద పడ్డాడు. ఆ మాటల్లోనే తన సంతోషం తెలిసిపోయింది అంటూ సాయి రాజేష్ తెలిపారు.