Director Sai Rajesh : వీడేం డైరెక్టర్ అన్నారు… కొబ్బరి మట్ట సినిమా టైమ్ లో నరకం అనుభవించాను…: దర్శకుడు సాయి రాజేష్

0
82

Director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటీనటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయిన రాజేష్ తన కెరీర్ విశేషాలను, అవమానాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కొబ్బరి మట్ట సినిమా టైమ్ లో బాగా అవమానించారు…

సాయి రాజేష్ తన మొదటి సినిమా హృదయ కాలేయంతో మంచి హిట్ అందుకున్నారు. ఆ సినిమా తరువాత మరోసారి సంపూర్నేశ్ బాబు హీరోగా కొబ్బరి మట్ట సినిమా చేయాలని అనుకోగా ఆ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవడంతో గీత ఆర్ట్స్ బన్నీ వాసు గారు హెల్ప్ చేశారట. అయితే మీడియాలో మెగా ప్రొడ్యూసర్ ను బుట్టలో వేసుకుని మోసం చేస్తున్న డైరెక్టర్ అన్నట్లుగా కథనలు రావడం చాలా బాధగా అనిపించింది.

వాసు గారే పిలిచి అలాంటివి పట్టించుకోకు నా మీద ఎన్నో వస్తుంటాయి అవన్నీ ఆలోచిస్తే కష్టం అని చెప్పారట. ఇక 2015 నుండి 2019 సంవత్సరాల మధ్య టైమ్స్ లో చాలా నరకం అనుభవించాను, చాలా మంది చాలా రకాలుగా అవమానించారు. వాటన్నిటికీ ఒక సినిమా తీసి బదులు చెప్పాలని అనిపించేది అలాంటి సినిమానే బేబీ అంటూ చెప్పారు సాయి రాజేష్.