Director Surendar Reddy wife Deepa : హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా రాబోతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికీ విడుదల అయిన ట్రైలర్స్, పోస్టర్స్ ఆకట్టుకోగా ఇప్పటి వరకు చూసిన అఖిల్ వేరు ఇకపై చూసే అఖిల్ వేరు అంటున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి భార్య దీప. ఆమె స్వతహాగా స్టైలిస్ట్ అవడం వల్ల సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ కి స్టైలిస్ట్ గా వ్యవహరించారు. ఇక తాజగా ఆమె హైదరాబాద్ లో సొంత సెలూన్ ను ప్రారంభించిగా ఆమె గురించి అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గురించి ఇంటర్వ్యూలో మాట్లాడారు.

నన్ను హీరోయిన్ గా చేయమంటున్నారు…
దీప గారు వ్యాపారవేత్తగా రాణించాలి అని భావించడం వల్ల హైదరాబాద్ లో పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లభించనిది గమనించిన ఆమె వాటిని ప్రవేశపెట్టాలని భావించి సెలూన్ ఏర్పాటు చేసారు. ఇక ఇప్పటికే తన భర్త డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరోయిన్స్ కి స్టైలిస్ట్ గా వ్యవహరించిన దీప గారు ప్రతి సినిమాలోనూ హీరోలను, హీరోయిన్లను కొత్తగా చూపిస్తారు సురేందర్ రెడ్డి అంటూ దీప చెప్పారు.

ఇక తాను రేసు గుర్రం లో శృతిహాసన్ ఊసరవెల్లి లో తమన్నా స్టైలింగ్ లో ప్రముఖంగా వ్యవహారించారు దీప. ఇక సురేందర్ గారి సినిమాల్లో చేసిన హీరోలు హీరోయిన్లు ఇచ్చిన బెస్ట్ కంప్లిమెంట్ ఎంటి అని అడుగగా మీరే హీరోయిన్ గా సినిమాల్లో చెయ్యొచ్చుగా అని అనేవారు అంటూ అయితే నాకు ఆసక్తి లేదు అంటూ దీప తెలిపారు.































