Director Teja : రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన వద్ద సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి రాత్, గులాం తదితర హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి అవార్డ్స్ కూడా అందుకున్నారు. తరువాత సినిమా డైరెక్టర్ అయిన తేజ చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆయన సినిమాల్లో హీరోల దగ్గరి నుండి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరినీ ఆడిషన్ చేసి ఆయనే స్వయంగా ఎంపిక చేస్తారు. చాలా రోజుల గ్యాప్ తరువాత డైరెక్టర్ తేజ మళ్ళీ ‘అహింస’ అనే సినిమాతో మళ్ళీ వస్తున్నాడు. కొత్తవాళ్ళను ఎక్కువగా ప్రోత్సహించే తేజ మరోసారి కొత్త హీరోతో వస్తున్నాడు. ఇక తన కెరీర్ లో ఎన్నో సార్లు తప్పు చేసానంటూ చెప్తున్న డైరెక్టర్ తేజ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆర్జీవిని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను…
రామ్ గోపాల్ వర్మ శిష్యులలో డైరెక్టర్ తేజ ఒకరు. ఆయన హిందీ సినిమాలకు కథ రాయడం అలానే కెమెరా మెన్ గా కూడా పనిచేసిన తేజ కు ఆర్జీవి అంటే చాలా ఇష్టం. అలాంటి ఆర్జీవి ని ఎవరైనా ఏమైనా అంటే నచ్చదు అంటూ చెప్పారు. తనని పైకి తీసుకొచ్చిన వాళ్ళలో ఆర్జీవి ఉంటారు. నాకు పనిచ్చిన ఆర్జీవి అంటే చాలా గౌరవం అంటూ చెప్పారు. నా అనుకున్న వాళ్ళు తప్పు చేసినా వాళ్లను నేను కాపాడుతాను. వేరేవాళ్ళను విమర్శించనివ్వను అంటూ చెప్పారు తేజ. అలాగే ఆర్జీవి ఈ మధ్యకాలంలో అమ్మాయిల కాళ్ళు నాకూతూ వాళ్లతో తాగుతూ తిరిగినా నాకనవసరం ఆయనని ఏమైనా అంటే నాకు నచ్చదంతే .

అయన పర్సనల్ లైఫ్ లో ఏం చేస్తారు, తప్పా కరెక్టా అవన్నీ నాకెందుకు, నా పనులు నాకు చాలా ఉన్నాయి. పక్కన వాళ్ళ జీవితం చూడటానికి సమయం లేదు అంటూ చెప్పారు. ఇక తాను బాల్యంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడుతూ ఉడిపి హోటల్ లో ఇడ్లీలు వేసేవాడిని. అలాగే ఫ్లోర్స్ క్లీన్ చేసేవాడిని అన్ని పనులను చేశాను. ఒక ఏజ్ లో ఎవరైనా అవమానిస్తే, కొడితే పగ తీర్చుకోవాలని అనుకునే వాడిని. చిన్నపుడు ఒక వ్యక్తి నన్ను ఎపుడూ కొడుతుండేవాడు అతడిని పెద్దయ్యాక కొట్టాలని అనుకునేవాడిని, బాత్రూమ్ లోకి వెళ్లి టాప్ ఆన్ చేసి గట్టిగా ఏడ్చి బయటికి వచ్చేవాడిని. నేను ఏడ్చే విషయం తెలియనిచ్చేవాడిని కాదు అంటూ పెద్దగయ్యాక అలాంటి రివెంజ్ మర్చిపోయి మామూలుగా ఉంటున్నాను, నేను బాధపడిన సంఘటనలు మర్చిపోను కానీ అవమానించిన మనుషుల గురించి మర్చిపోతా, ఆ అవమానాలు రోజూ గుర్తుంటాయి అంటూ చెప్పారు తేజ.