Director Teja : నా కొడుకుకి, కూతురికి పెళ్లి చేయను… జేడి చక్రవర్తి చెప్పిందంతా సొల్లు… పిల్లలు ఏం చేస్తున్నారంటే…: దర్శకుడు తేజ

0
266

Director Teja : కొత్తవాళ్లను పెట్టి సినిమాలను తీస్తూ కొత్త టెక్నిషియన్స్ అలాగే ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ కథా బలమున్న సినిమాలతోనే సక్సెస్ కొట్టే డైరెక్టర్ తేజ. తన సినిమాలే కాకుండా నిజ జీవితంలో కూడా చాలా భిన్నంగా ఉండే ఈ ఆర్జీవి శిష్యుడు చాలా గ్యాప్ తరువాత మళ్ళీ సినిమా చేస్తున్నారు. సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా ‘అహింస’ అనే సినిమాను తీస్తున్నారు. ఇక తన వ్యక్తిగత విషయాలను సినిమాల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు తేజ.

జేడీ చెప్పిందంతా అపద్ధం… నా పిల్లలకు పెళ్లి చేయను…

తేజ గారు ఎపుడూ సినిమా గురించి మాత్రమే మాట్లాడుతారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గాను, కెమెరా మెన్ గాను చాలా మందికి తెలిసినా అంతకంటే ముందు మేకప్ అసిస్టెంట్ గాను క్యాస్టుమ్ అసిస్టెంట్ గాను కూడా ఎన్నో సినిమాలకు పనిచేసారు. ఇక డిస్ట్రిబ్యూషన్ వైపు థియేటర్స్ బిజినెస్ వైపు అడుగుపెట్టిన తేజ ప్రస్తుతం ప్రొడక్షన్ వైపు, డైరెక్టర్ గాను సినిమాలను తీస్తున్నారు. ఇక తన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడుతూ ఒక కొడుకు కూతురు ఉండగా చిన్న అబ్బాయి అనారోగ్య సమస్యలతో మరణించాడు. ఇక కొడుకు అమెరికాలో ఫిల్మ్ కోర్స్ పూర్తి చేసుకుని ప్రెసెంట్ హీరోగా రావడానికి ట్రై చేస్తుండగా కూతురు అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఇండియా వస్తోందట.

ఇక కూతురు పెళ్లి గురించి అడుగగా నేను కూతురుకైనా కొడుకుకైనా ఒక్కటే చెప్పా, మీకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొండి. నేను సంబంధాలను చూడటం, వెతకడం లాంటివి చేయను. మీకు నచ్చితే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొండి ఒక పదిమందిని పిలిచి భోజనము పెడతాం అంతే అని చెప్పేశారట. ఇక తన భార్య శ్రీ వల్లి గురించి చెబుతూ తమది లవ్ మ్యారేజ్ అంటూ జేడి చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పినవన్నీ అపద్ధం అని చెప్పారు. తమ పెళ్లి అక్కినేని వెంకట్ గారు నాగేశ్వరావు గారి కోడలు జోత్స్న గారు చేశారని, పెద్దలు కుదుర్చిన వివాహం అంటూ చెప్పారు.