Director V.N. Adithya : 2001లో వచ్చిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో తొలిసారిగా డైరెక్టర్ గా హిట్ కొట్టాడు వి.ఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే సినిమా తరువాత మళ్ళీ ఉదయ్ కిరణ్ తోనే మరో సారి ‘శ్రీరామ్’ అనే సినిమా చేసి పర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ఒకేసారి ఆదిత్య కు చిరంజీవి, అలాగే నాగార్జున ఇద్దరి నుండి ఆఫర్ వచ్చింది. ఒకేసారి రెండు హ్యాండిల్ చేయడం కష్టమై ఇక చిరంజీవి సినిమా సరిగా రాకపోవడం వల్ల వదులుకున్నారు. ఇక నాగార్జున తో ‘నేనున్నాను’ సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ సినిమా సక్సెస్ తరువాత వి.ఎన్ ఆదిత్య తీసిన మనసు మాట వినదు, బాస్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.

మనసంతా నువ్వే సినిమాకు చాలా డబ్బు వచ్చింది…
ఉదయ్ కిరణ్ హీరోగా రీమా సేన్ హీరోయిన్ గా వచ్చిన మనసంతా నువ్వే సినిమా మంచి హిట్. ఆ సినిమా బాగా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. అలా సినిమా హిట్ అయ్యాక అడ్వాన్స్ రూపంలో అప్పటి వరకు జీవితంలో చూడనంత లిక్విడ్ క్యాష్ చూశారట ఆదిత్య గారు. ఎంతో మంది నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారట. అయితే అంతమందికి సినిమా చేయలేనని చాలా మందికి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి ఒక ఐదు మందివి మాత్రం అలానే పెట్టుకున్నా, అవన్నీ పెద్ద ప్రొడక్షన్స్ హౌస్లవి కావడం వల్ల ఇవ్వలేదు.

ఇక మనసంతా నువ్వే సినిమా తరువాత తీసిన సినిమా ఫ్లాప్ అయింది అయితే ఆపైన నాగార్జున గారితో తీసిన నేనున్నాను మళ్ళీ హిట్ కొట్టి నిలబెట్టింది. కానీ నా తప్పు డెసిషన్ వల్ల తీసిన మనసు మాట వినదు సినిమా ఫ్లాప్ అయినా కూడా నాగార్జున గారు మళ్ళీ బాస్ సినిమా ఆఫర్ ఇచ్చారు. అదే సమయంలో నాగార్జున గారి శ్రీరామ దాసు సినిమా విడుదల అయి హిట్ అవడం వల్ల ఆ ప్రభావం బాస్ సినిమా మీద పడింది. అలా సినిమా ఫ్లాప్ అయింది అంటూ ఆదిత్య తెలిపారు.