Divyvani : తెలుగింటి బాపు బొమ్మ దివ్యవాణి అంటే అప్పట్లో అందరూ ఫిదా అయ్యేవారు. చామన ఛాయలో గడుసు తనం, పెద్ధ కళ్ళు వాలు జడతో అందరినీ ఆకట్టుకున్న ఈ తెలుగు బొమ్మ చేసింది కొన్ని సినిమాలే అయినా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయేలా ఆ సినిమాలలో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘పెళ్లిపుస్తకం’ సినిమాలో సత్యభామ గా ఆమె నటన ఎవరూ మర్చిపోలేరు. ఇక ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ వంటి సినిమాలలో కూడా అందరినీ ఆకట్టుకుంది దివ్యవాణి. హీరోయిన్ గా బాగా ఉన్నపుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన దివ్యవాణి పిల్లలు పుట్టాక హిందూ నుండి క్రిస్టియానిటీకి మారిపోయింది. ఇక తన భర్త పిల్లలను గురించిన వివరాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

కాఫీ బిజినెస్… ఎన్ని కోట్లు ఆస్తి ఉందంటే…
దివ్యవాణి కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినపుడు తన అత్తింటి వాళ్లకు తమ వాళ్లకు గొడవలు జరిగాయని, వాళ్ళు కన్నడ నేను ఆంధ్ర అయ్యేసరికి గొడవలు జరిగాయంటూ చెప్పారు. కూర్గ్ కి చెందిన తన భర్తకు కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయంటూ చెప్పారు. కన్నడ సినిమాలో నటించే సమయంలో పరిచయం, పెళ్లి జరిగాయని చెప్పారు.

పెళ్లి తరువాత గొడవల కారణంగా అత్తింటికి దూరంగా ఉన్నానంటూ ఇక బాబు విషయంలో చేతబడి అలాంటివి చేయించడం వల్ల దూరం పెరిగిందని చాలా ఇబ్బందులు పడ్డామంటూ చెప్పారు. ఇక తనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని అలాంటిదేమి లేదు కానీ పర్వాలేదు హ్యాపీగా ఉన్నాం, అంతే కానీ వేలకోట్లు అవన్నీ అపద్దాలే అంటూ చెప్పారు.































