Divyavani : బాపు గారి సినిమాల్లో హీరోయిన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దివ్య వాణి. పెళ్లి పుస్తకం సినిమా లో సత్యభామ గా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. వాలు జడ, పెద్ద కళ్ళతో తెలుగింటి అమ్మాయి అంటే అలానే ఉండాలి అనేంతలా దివ్య వాణి అందం తెలుగు ప్రేక్షకులను ఆకర్శించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్య వాణి అసలు పేరు ఉషారాణి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించిన తరువాత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్ని భాషలలోనూ సినిమాలను చేసిన దివ్య వాణి తన కెరీర్ అలానే వ్యక్తిగత జీవితం గురించి అలాగే రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఎందుకు టీడీపీ వీడాల్సి వచ్చిందో వివరించారు.

రోజా తో కలిసి పనిచేయాల్సి వస్తే…
టీడీపీ లో ఉన్న సమయంలో వైసీపీ నేతల మీద బాగా విమర్శించి ఫైర్ బ్రాండు గా పేరు తెచ్చుకున్న దివ్యవాణి ప్రస్తుతం టీడీపీ నుండి బయటకు వచ్చేసారు. త్వరలో వైసీపీ లో చేరుతారు అనే ఊహగానాల నడుమ ఆ పార్టీ లో చేరే అంశం మీద ఆలోచిస్తున్నట్లు చర్చలు జరుగుతున్నాయి అంటూ అధికారికంగా నిర్ణయం చెబుతానంటూ చెప్పారే కానీ చేరుతున్నాను అని మాత్రం చెప్పలేదు. ఇక ఒకవేళ వైసీపీ లో చేరితే ఒకప్పుడు విమర్శించిన వారితో కలిసి పనిచేయాల్సి వస్తుంది.

ఈ అంశం మీద మాట్లాడుతూ ఒకప్పుడు ప్రస్తుత మంత్రి ఆర్కే రోజా ను బాగా విమర్శించిన దివ్యవాణి ఆమెతో కలిసి పనిచేయాల్సి వస్తే ఇంటినే ప్రశ్నకు జవాబు ఇచ్చారు. రోజా మాట్లాడిన వాటికి కౌంటర్ ఇచ్చాను అంతే భవిష్యత్ లో కలిసి పనిచేయాల్సి వస్తే చేస్తాను అంటూ చెప్పారు. ఇక రోజా మాట తీరు అభ్యంతరకరంగా ఉన్నా తన అనుకున్న దారిలో తాను సక్సెస్ అయిన తీరు ఒక మహిళగా తాను కష్టపడి సాధించినది అందరికీ ఆదర్శమే అంటూ చెప్పారు



































